పోలీస్ ఆఫీసర్ గెటప్ లో సంగీత దర్శకుడు కోటి

Music Director Koti Turns Police Officer,Music Director Koti Turns Police Officer,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Music Director Koti Latest News,Music Director Koti Upcoming Movie News,Music Director Koti Next Film Updates,Music Director Koti Latest Movie News,Music Director Koti Latest Film Updates

ప్రముఖ రాజకీయ నాయకుడు దేవినేని నెహ్రూ జీవిత చరిత్ర ఆధారంగా RTR ఫిల్మ్స్ బ్యానర్ పై నర్రా శివనాగేశ్వర రావు దర్శకత్వం లో దేవినేని మూవీ రూపొందుతుంది. నందమూరి తారక రత్న -దేవినేని నెహ్రూ, తుమ్మల ప్రసన్న కుమార్ -చలసాని వెంకటరత్నం, సురేష్ కొండేటి – వంగవీటి రంగా పాత్రలలో నటిస్తున్నారు. తన సంగీతం తో ప్రేక్షకులను ఉర్రూతలూగించిన సంగీత దర్శకుడు కోటి ఈ మూవీ లో
సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ KS వ్యాస్ గా నటించడం విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

దర్శకుడు నర్రా శివనాగేశ్వర రావు మాట్లాడుతూ ..దేవినేని మూవీ 75 శాతం షూటింగ్ కంప్లీట్ అయిందని, మరో షెడ్యూల్ తో షూటింగ్ పార్ట్ కంప్లీట్ కానుందని, పతాక సన్నివేశాలను భారీగా చిత్రీకరించడానికి సన్నాహాలు చేస్తున్నామని చెప్పారు. సంగీత దర్శకుడు కోటి మాట్లాడుతూ .. తన సినీ కెరీర్ లో ఇది రెండవ దశ అని, 20 సంవత్సరాల సంగీత ప్రయాణం పూర్తి చేసుకున్నానని, ఇప్పుడు నటుడిగా ఒక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా ప్రేక్షకులముందుకు వస్తున్నానని అన్నారు . కోటి ఫస్ట్ లుక్ ను చిత్ర యూనిట్ ఈ రోజు రిలీజ్ చేసింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 5 =