గత ఏడాది జూలై నెలలో విడుదలైన `ఆర్ ఎక్స్ 100`తో సంచలన విజయాన్ని అందుకున్నాడు దర్శకుడు అజయ్ భూపతి. ఇక ఈ సంవత్సరం జూలై నెలలో రిలీజైన `ఇస్మార్ట్ శంకర్`తో యువ కథానాయకుడు రామ్ కూడా అదే స్థాయిలో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కట్ చేస్తే… త్వరలో ఈ ఇద్దరి కలయికలో ఓ ఆసక్తికరమైన చిత్రం రాబోతుందని తెలిసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… భవ్య క్రియేషన్స్ నిర్మాణంలో అజయ్ భూపతి దర్శకుడిగా ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఇందులో కథానాయకుడిగా రామ్ నటిస్తాడని టాక్. అయితే, రామ్ ఎంట్రీపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇదిలా ఉంటే… భవ్య క్రియేషన్స్ చిత్రం కంటే ముందు అజయ్ భూపతి `మహాసముద్రం`ని తెరకెక్కించాల్సి ఉంది. మాఫియా నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్… అక్టోబర్ నుంచి పట్టాలెక్కనుంది. `మహాసముద్రం` పూర్తయ్యాకే భవ్య క్రియేషన్స్ సంస్థలో అజయ్ చిత్రం సెట్స్ పైకి వెళుతుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: