
ట్యాగ్ · 1690 కథనాలు · పేజీ 51


శ్రద్దా ఖాతాలో రెండు సెంచరీలు

'సేవ్ కావేరి'కి తనవంతు చేయూతనిస్తున్న సంజన

నాగ్-చై బంగార్రాజు మూవీ అప్ డేట్..!

20 ఇయర్స్ తరువాత "ఉపేంద్ర " మూవీ రీరిలీజ్

ఇండస్ట్రీ హిట్ `ఠాగూర్`కు 16 ఏళ్ళు

సాయి తేజ్ `సుబ్రమణ్యం For సేల్’కి 4 ఏళ్ళు

`రాక్షసుడు` దర్శకుడితో రవితేజ చిత్రం?

సెప్టెంబర్ 24 కేరాఫ్ మెమరబుల్ మూవీస్
'వరల్డ్ ఫేమస్ లవర్' - ఆ రూమర్ లో నిజం లేదు..!

'అ' డైరెక్టర్ కు అఖిల్ గ్రీన్ సిగ్నల్..?

మహేష్ కోసం 16 ఏళ్ళ తరువాత..!

'సాండ్ కీ ఆంఖ్' ట్రైలర్ రిలీజ్

నటసింహ బాలకృష్ణ ‘బొబ్బిలి సింహం’కు 25 ఏళ్ళు

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘దూకుడు’కి 8 ఏళ్ళు

సోలో బ్రతుకే సో బెటర్` అంటున్న సాయితేజ్?

'గద్దల కొండ గణేష్' పై మహేష్ ప్రశంసలు
హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా గద్దలకొండ గణేశ్. ఈనెల 20వ తేదీన విడుదలైన ఈ సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకొని మంచి కలెక్షన్స్ రాబడుతూ బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. ఈ సినిమాకి హైలైట్ వరుణ్ తేజ్ అని చెప్పొచ్చు. మొదటిసారి నెగెటివ్ షేడ్ లో చేసిన వరుణ్ తేజ్ గెటప్ కు, వరుణ్ తేజ్ డైలాగ్స్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక సినిమాను చూసిన సెలెబ్రిటీస్ అందరూ కూడా గద్దల కొండ గణేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ మూడవ సాంగ్ రిలీజ్
రక్త చరిత్ర, లక్ష్మీస్ ఎన్టీఆర్ వంటి వివాస్పద చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాస్పద చిత్రం కమ్మరాజ్యం లో కడప రెడ్లు మూవీ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అజయ్ మైసూర్ సమర్పణ లో టైగర్ కంపెనీ ప్రొడక్షన్ బ్యానర్ పై ఆర్ జి వి దర్శకత్వంలో రూపొందుతున్న కమ్మరాజ్యంలో కడప రెడ్లు మూవీ లోని 2 సాంగ్స్ రిలీజ్ అయ్యాయి . ఆ రెండు సాంగ్స్ లో ఒక సాంగ్ వర్మ గానం చేయడం విశేషం.

శ్రద్దా ఖాతాలో రెండు సెంచరీలు
మొత్తానికి ఈ ఏడాది బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దా కపూర్ కి బాగానే కలిసొచ్చింది చెప్పొచ్చు. వెంట వెంటనే తెలుగులోనూ.. అటు హిందీలోనూ హిట్స్ కొట్టి రెండు సెంచరీలు కొట్టింది. సుజీత్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్ తో తెరకెక్కిన సాహో చిత్రం మిక్స్డ్ టాక్ ను సొంతం చేసుకున్నా కూడా టాక్ తో సంబంధ లేకుండా కలెక్షన్స్ రాబట్టింది. ఇక తెలుగులో కంటే హిందీలోనే ఈ సినిమా ఎక్కువ కలెక్షన్స్ రాబట్టింది చెప్పొచ్చు. హిందీలో 150కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఆశ్చర్యపరిచింది.

'సేవ్ కావేరి'కి తనవంతు చేయూతనిస్తున్న సంజన
సేవ్ కావేరి.. ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇది. కావేరి నది జలాల పరిరక్షణకు, పర్యావరణానికి సద్గురు అండ్ ఇషా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కావేరి కాలింగ్ పేరు తో ఉద్యమం ప్రారంభమైన సంగతి తెలిసిందే. సేవ్ కావేరి పేరుతో సద్గురు జగ్గీ వాసుదేవ్ మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం ద్వారా సద్గురు మొత్తం 242 కోట్ల మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. సంగతి తెలిసిందే.

నాగ్-చై బంగార్రాజు మూవీ అప్ డేట్..!
కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో నాగార్జున హీరోగా వచ్చిన 'సోగ్గాడే చిన్ని నాయన' సినిమా ఎంత మంచి హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇక ఈ సినిమా సీక్వెల్ ను కూడా తీయాలని ఎప్పటినుండో ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య ప్రస్తుతం వెంకీమామ సినిమాతో బిజీ గా ఉన్నాడు. నాగార్జున మొన్నటివరకూ మన్మథుడు2 సినిమాతో బిజీగా ఉన్నాడు. అయితే ఇప్పుడు నాగార్జున మన్మథుడు2 సినిమా రిలీజ్ అయిపోయింది. నాగ చైతన్య సినిమా వెంకీమామ ముగింపుదశకు వచ్చింది.

20 ఇయర్స్ తరువాత "ఉపేంద్ర " మూవీ రీరిలీజ్
అతిథి పాత్రలలో శాండల్ వుడ్ కు నటుడిగా పరిచయమైన ఉపేంద్ర తర్లే నన్మగ మూవీ తో దర్శకుడిగా మారి ఓం, స్వస్తిక్ వంటి మూవీస్ కు దర్శకత్వం వహించారు. హీరోగా, దర్శకుడిగా రూపొందిన A మూవీ తో ఉపేంద్ర విజయం సాధించారు . శ్రీనివాస ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఉపేంద్ర హీరోగా, స్వీయ దర్శకత్వంలో రూపొందిన సైకలాజికల్ థ్రిల్లర్ ఉపేంద్ర 1999 అక్టోబర్ లో రిలీజయి ఘనవిజయం సాధించింది. ఉపేంద్ర మూవీ లో ప్రేమ, దామిని, రవీనా టాండన్ కథానాయికలు. రవీనా కు కన్నడంలో తొలిపరిచయ చిత్రం.

ఇండస్ట్రీ హిట్ `ఠాగూర్`కు 16 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా పలు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వచ్చాయి. వాటిలో `ఠాగూర్` ఒకటి. లంచగొండి వ్యవస్థపై పోరాటం సాగించిన ఠాగూర్ అనే ఓ ప్రొఫెసర్ కథతో ఈ చిత్రం తెరకెక్కింది. `ఇంద్ర` వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత చిరు నటించిన ఈ సినిమా కూడా అదే బాట పట్టింది. అంతేకాదు... ప్రస్తుతానికి చిరు కెరీర్‌లో ఇదే చివరి ఇండస్ట్రీ హిట్ కావడం విశేషం. శ్రియ, జ్యోతిక కథానాయికలుగా నటించిన ఈ బ్లాక్‌బస్టర్ మూవీలో ప్రకాష్ రాజ్, పునీత్ ఇస్సార్, కోట శ్రీనివాసరావు, షాయాజీ షిండే, సునీల్, కె.విశ్వనాథ్, ఎం.ఎస్.నారాయణ, రమాప్రభ, ఉత్తేజ్ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. తమిళ చిత్రం…

సాయి తేజ్ `సుబ్రమణ్యం For సేల్’కి 4 ఏళ్ళు
మెగా కాంపౌండ్ హీరోలకి కలిసొచ్చిన దర్శకుల్లో హరీష్ శంకర్ ఒకరు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, సాయితేజ్, వరుణ్ తేజ్... ఇలా మెగా హీరోలతో హరీష్ తెరకెక్కించిన ప్రతీ సినిమా విజయం సాధించింది. అలా సక్సెస్ చూసిన చిత్రాల్లో... సాయితేజ్ హీరోగా నటించిన `సుబ్రమణ్యం For సేల్’ ఒకటి. రెజీనా నాయికగా నటించిన ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో అదా శర్మ, నాగబాబు, సుమన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, నరేష్, ఝాన్సీ, ప్రగతి, సురేఖా వాణి తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

ఈ ఏడాది చివరలో పట్టాలెక్కనున్న వెంకీ, తరుణ్ భాస్కర్ చిత్రం?
‘పెళ్ళిచూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది?’ చిత్రాలతో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నాడు తరుణ్ భాస్కర్. ప్రస్తుతం `మీకు మాత్రమే చెప్తా`లో కథానాయకుడిగా నటిస్తున్న తరుణ్... త్వరలో మరోసారి మెగాఫోన్ పట్టడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో విక్టరీ వెంకటేష్ హీరోగా నటించనున్నాడు.

`రాక్షసుడు` దర్శకుడితో రవితేజ చిత్రం?
మాస్ మహారాజా రవితేజ... ప్రస్తుతం `డిస్కో రాజా`తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. వీఐ ఆనంద్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ డ్రామా... డిసెంబర్ 20న రిలీజ్ కానుంది. ఈ లోపే `డాన్ శీను`, `బలుపు` చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్ మూవీని పట్టాలెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నాడు రవితేజ. అంతేకాదు... మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌కి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట ఈ టాలెంటెడ్ హీరో.

సెప్టెంబర్ 24 కేరాఫ్ మెమరబుల్ మూవీస్
లెజెండరీ యాక్టర్ అక్కినేని నాగేశ్వరరావుకి, సెప్టెంబర్ 24కి మంచి అనుబంధమే ఉంది. ఎందుకంటే... ఇదే రోజున వేర్వేరు సంవత్సరాల్లో ఏయన్నార్ నటించిన మూడు చిత్రాలు విడుదల కాగా... ఆ మూడు సినిమాలు కూడా మంచి విజయం సాధించడమే కాకుండా నటుడిగా తనకి మంచి గుర్తింపుని తీసుకువచ్చాయి. ఆ చిత్రాలే... `పల్నాటి యుద్ధం’, `ప్రేమనగర్`, `మేఘసందేశం’.
'వరల్డ్ ఫేమస్ లవర్' - ఆ రూమర్ లో నిజం లేదు..!
క్రాంతి మాధవ్ డైరెక్షన్ లో 'విజయ్ దేవరకొండ హీరోగా వరల్డ్ ఫేమస్ లవర్ అనే ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించారు. ఇక ఇటీవలే టైటిల్ పోస్టర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్సే వచ్చింది.

'అ' డైరెక్టర్ కు అఖిల్ గ్రీన్ సిగ్నల్..?
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో అఖిల్ 4వ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న పూజ హెగ్డే కూడా షూటింగ్ లో జాయిన్ అయింది. లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ గా ఈ సినిమాను గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై నిర్మిస్తుండగా... గోపి సుందర్ సంగీతం అందిస్తున్నారు. ఇక ఈ సినిమా సెట్స్ పై ఉండగానే అఖిల్ తన ఐదో సినిమాను లైన్లో పెట్టినట్టు వార్తలు వస్తున్నాయి.

'గద్దల కొండ గణేష్' ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్
హరీష్ శంకర్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా 'గద్దల కొండ గణేష్' రిలీజై మంచి టాక్ ను సొంతం చేసుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో వరుణ్ తేజ్ గెటప్.. ఊరమాస్ యాక్టింగ్, హరీష్ శంకర్ టేకింగ్ సినిమాకు ప్లస్ అయ్యాయి.. ఇక కలెక్షన్ల పరంగా కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది. మూడు రోజులకు రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ 13 కోట్లకుపైగా షేర్ రాబట్టిన ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రూ 15 కోట్లకు పైగా కోట్లు షేర్ కొల్లగొట్టింది. మరి ఈ సినిమా ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

మహేష్ కోసం 16 ఏళ్ళ తరువాత..!
గుణ శేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు, భూమిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . మహేష్ బాబు కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయిన సినిమా. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా. ఇక ఈ సినిమాలో కర్నూల్ కొండరెడ్డి బురుజు కూడా అప్పట్లో పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ కూడా అయింది. ఈ లొకేషన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక ఐకానిక్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ లొకేషన్ ను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మహేష్ సినిమా కోసం వాడుతున్నాడు అనిల్ రావిపూడి.

'సాండ్ కీ ఆంఖ్' ట్రైలర్ రిలీజ్
హిందీలో వరుస సినిమాలతో దూసుకుపోతుంది తాప్సీ. అంతే కాదు అక్కడ తాను చేస్తున్న సినిమాలు కూడా వరుస విజయాలు దక్కించుకుంటున్నాయి. ఇటీవలే తాను నటించిన మిషన్ మంగళ్ సినిమా కూడా హిట్ అయింది. ఇక ప్రస్తుతం తను 'సాండ్ కీ ఆంఖ్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో షూటర్ దాదీస్‌గా పేరొందిన మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ అనే ఇద్దరు మహిళల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ఇప్పటికే రిలీజ్ అవుతుంది.

నటసింహ బాలకృష్ణ ‘బొబ్బిలి సింహం’కు 25 ఏళ్ళు
నటసింహ నందమూరి బాలకృష్ణకి బాగా కలిసొచ్చిన దర్శకుల్లో ఎ.కోదండరామిరెడ్డి ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వచ్చిన పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించాయి. అలా విజయం సాధించిన సినిమాల్లో ‘బొబ్బిలి సింహం’ ఒకటి. బాలకృష్ణ సరసన రోజా, మీనా కథానాయికలుగా నటించగా ‘ఊర్వశి’ శారద, కైకాల సత్యనారాయణ, జగ్గయ్య, శరత్‌బాబు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, రాళ్ళపల్లి, సంగీత, సుధ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

సూపర్ స్టార్ మహేష్ బాబు ‘దూకుడు’కి 8 ఏళ్ళు
సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్‌లో ప్రత్యేకంగా నిలచిన చిత్రాల్లో `దూకుడు` ఒకటి. ముఖ్యంగా... `పోకిరి` (2006) వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత సరైన విజయం లేని మహేష్‌కి ఐదేళ్ళ తరువాత `దూకుడు` రూపంలో మరో సెన్సేషనల్ హిట్ దక్కింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్... ఆ ఏటి మేటి చిత్రంగా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. అలాగే... ఓవర్సీస్‌లోనూ సెన్సేషన్ క్రియేట్ చేసి అక్కడ వెరీ ఫస్ట్ వన్ మిలియన్ డాలర్ టాలీవుడ్ ఫిల్మ్‌గా రికార్డులకెక్కి ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అనిపించుకుంది. అంతేకాదు... `దూకుడు` తరువాత దాదాపు మహేష్ చిత్రాలన్నీ వన్…

చిరంజీవి, కొరటాల సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో… చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా... ఈ క్రేజీ ప్రాజెక్ట్ అక్టోబర్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

సోలో బ్రతుకే సో బెటర్` అంటున్న సాయితేజ్?
`చిత్రలహరి`, `ప్రతి రోజూ పండగే`... ఇలా క్యాచీ టైటిల్స్‌తోనే వరుస సినిమాలు చేస్తున్న మెగా కాంపౌండ్ హీరో సాయి తేజ్... తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కి కూడా అదే శైలిని కొనసాగిస్తున్నాడు. రామ్ గోపాల్ వర్మ నిర్మాణంలో వచ్చిన ‘మనీ’ (1993) చిత్రంలోని “భద్రం బీ కేర్‌ఫుల్ బ్రదరు” పాట పల్లవిలో వినిపించే `సోలో బ్రతుకే సో బెటర్`అనే పంక్తితో సాయితేజ్ కొత్త సినిమా రాబోతుందని సమాచారం. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ద్వారా సుబ్బు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. రొమాంటిక్ అండ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కనున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ఇద్దరు నాయికలకు స్థానముండగా…