ఇండ‌స్ట్రీ హిట్‌ `ఠాగూర్`కు 16 ఏళ్ళు

#Tagore, 16 Years Completed For Megastar Chiranjeevi Tagore Movie, 16 Years For Industry Hit Chiranjeevi Tagore, Latest Telugu Movies News, Megastar Chiranjeevi Tagore Movie Completes 16 Years, Tagore Movie Updates, Tagore Telugu Movie Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా ప‌లు మెసేజ్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ వ‌చ్చాయి. వాటిలో `ఠాగూర్‌` ఒక‌టి. లంచ‌గొండి వ్య‌వ‌స్థ‌పై పోరాటం సాగించిన ఠాగూర్ అనే ఓ ప్రొఫెస‌ర్ క‌థ‌తో ఈ చిత్రం తెర‌కెక్కింది. `ఇంద్ర‌` వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత చిరు న‌టించిన ఈ సినిమా కూడా అదే బాట ప‌ట్టింది. అంతేకాదు… ప్ర‌స్తుతానికి చిరు కెరీర్‌లో ఇదే చివ‌రి ఇండస్ట్రీ హిట్ కావ‌డం విశేషం. శ్రియ‌, జ్యోతిక కథానాయికలుగా నటించిన ఈ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీలో ప్రకాష్ రాజ్, పునీత్ ఇస్సార్, కోట శ్రీనివాసరావు, షాయాజీ షిండే, సునీల్, కె.విశ్వనాథ్, ఎం.ఎస్.నారాయణ, రమాప్రభ, ఉత్తేజ్‌ తదితరులు ఇతర ముఖ్య భూమికలు పోషించారు. తమిళ చిత్రం ‘రమణ’(2002) ఆధారంగా రూపొందిన `ఠాగూర్‌`కి వి.వి.వినాయక్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌డ‌మే కాకుండా… అతిథి పాత్ర‌లో మెరిసారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“మెలోడీ బ్రహ్మ” మణిశర్మ స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. “చిన్నగ చిన్నగ”, “కొడితే కొట్టాలిరా”,“వానొచ్చేనంటే”, “గప్పుచిప్పు”, “మన్మథా మన్మథా”, “నేను సైతం”… ఇలా ప్ర‌తీ పాట‌ శ్రోత‌ల‌ను అల‌రించింది. అంతేకాదు… ఈ సినిమాతోనే `నేను సైతం`పాట‌కిగానూ `ఉత్త‌మ‌ గీత ర‌చ‌యిత`గా సుద్దాల అశోక్ తేజ జాతీయ పుర‌స్కారాన్ని అందుకున్నారు. లియో ప్రాజెక్ట్స్ (ప్రై) లిమిటెడ్ బ్యానర్‌పై బి.మధు ఈ చిత్రాన్ని నిర్మించారు. 2003 సెప్టెంబర్ 24న విడుదలైన `ఠాగూర్`… నేటితో 16 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − 6 =