న‌ట‌సింహ బాలకృష్ణ ‘బొబ్బిలి సింహం’కు 25 ఏళ్ళు

#BobbiliSimham, 25 Years For Balakrishna Blockbuster Movie Bobbili Simham, Bobbili Simham Movie Completes 25 Years, Bobbili Simham Movie Updates, Bobbili Simham Telugu Movie Completes 25 Years, Bobbili Simham Telugu Movie Latest News, Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

నటసింహ నందమూరి బాలకృష్ణకి బాగా కలిసొచ్చిన దర్శకుల్లో ఎ.కోదండరామిరెడ్డి ఒకరు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో వ‌చ్చిన‌ పలు చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద వ‌సూళ్ళ వ‌ర్షం కురిపించాయి. అలా విజ‌యం సాధించిన సినిమాల్లో ‘బొబ్బిలి సింహం’ ఒక‌టి. బాలకృష్ణ సరసన రోజా, మీనా కథానాయికలుగా నటించగా ‘ఊర్వశి’ శారద, కైకాల సత్యనారాయణ, జగ్గయ్య, శరత్‌బాబు, కోట శ్రీనివాసరావు, బ్రహ్మానందం, తనికెళ్ళ భరణి, రాళ్ళపల్లి, సంగీత, సుధ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎం.ఎం.కీరవాణి స్వరకల్పనలో రూపొందిన పాటలన్నీ ప్రేక్షకులను అలరించాయి. ముఖ్యంగా జాలాది కలం నుంచి జాలువారిన “శ్రీరస్తు శుభమస్తు” గీతం చిత్రానికే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా నిల‌వ‌గా… వేటూరి సుందరరామమూర్తి రచించిన “పాలకొల్లు పాప”, “కిట్టమ్మ లీల”, “మాయదారి పిల్లడ”, “లకడీ కా పూలట” “ఈడు ఈల వేసిన” పాటలు నందమూరి అభిమానులను ఆకట్టుకున్నాయి. విజయలక్ష్మి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై ప్ర‌ముఖ నిర్మాత‌ టి.త్రివిక్రమరావు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1994 సెప్టెంబర్ 23న విడుదలైన ‘బొబ్బిలి సింహం’… నేటితో 25 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

‘బొబ్బిలి సింహం’ – కొన్ని విశేషాలు:

* ‘భైరవద్వీపం’, ‘గాండీవం’ తరువాత బాలకృష్ణ, రోజా జంటగా నటించిన మూడో చిత్రమిది. 1994లోనే ఈ మూడు వ‌రుస‌ సినిమాలు రిలీజ్ కావ‌డం విశేషం. అంతేకాదు.. రోజా కెరీర్ బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ `బొబ్బిలి సింహం` చిత్రంలోదే కావ‌డం మ‌రో విశేషం.

* ‘అశ్వమేథం’ వంటి భారీ బడ్జెట్ మూవీ అనంతరం బాలయ్యకు జోడిగా మీనా నటించిన సినిమా ఇది.

* ‘రౌడీ ఇన్స్‌పెక్ట‌ర్‌’ వంటి సెన్సేష‌న‌ల్ హిట్ త‌రువాత‌ నిర్మాత టి.త్రివిక్రమరావు, బాలయ్య కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ఇది.

* రాజ‌మౌళి తండ్రి, `బాహుబ‌లి` ర‌చ‌యిత విజయేంద్ర‌ప్ర‌సాద్ ఈ సినిమాకి క‌థ‌ను అందించారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − six =