చిరంజీవి, కొరటాల సినిమాకి బాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్స్?

Bollywood Music Director For Chiranjeevi And Koratala Siva Movie?, Chiranjeevi 152nd Film Latest News, Chiranjeevi and Koratala Siva Movie Latest News, Latest Telugu Movies News, Mega Star Chiranjeevi And Director Koratala Siva Movie Latest Updates, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్‌ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో… చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్. భారీ బడ్జెట్‌తో రూపొందనున్న ఈ సినిమాని కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. కాగా… ఈ క్రేజీ ప్రాజెక్ట్ అక్టోబ‌ర్ మూడో వారం నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుందని సమాచారం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… ఈ సినిమాకి బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌క‌ద్వయం అజయ్, అతుల్‌ స్వ‌రాలు అందించ‌నున్న‌ట్లు టాక్‌. ‘సింగం’, ‘అగ్నిపథ్’, ‘సూపర్ 30’ త‌దిత‌ర విజ‌య‌వంత‌మైన హిందీ చిత్రాలకు సంగీత‌మందించిన‌ ఈ అన్న‌ద‌మ్ములు… మరాఠీ సెన్సేష‌న్ ఫిల్మ్ ‘సైరాట్’తోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అంతేకాదు… గ‌తంలో రవితేజ, జ్యోతిక జంటగా హరీష్ శంకర్ తెరకెక్కించిన ‘షాక్’(2006)కి కూడా బాణీలు అందించారు. మ‌ళ్ళీ 13 ఏళ్ళ భారీ విరామం తరువాత… ఇప్పుడు చిరు, కొరటాల సినిమాతో టాలీవుడ్‌లోకి రీ-ఎంట్రీ ఇవ్వ‌నున్నారు అజ‌య్‌-అతుల్‌. కాగా… చిరు – కొర‌టాల కాంబినేష‌న్ మూవీకి సంబంధించి ఈ మ్యూజిక్ డైరెక్టర్స్ ఎంట్రీపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవ‌కాశ‌ముంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 5 =