సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ‘దూకుడు’కి 8 ఏళ్ళు

#Dookudu, 8 Years For Industry Hit Dookudu, Dookudu Movie Completes 8 Years, Dookudu Movie Updates, Dookudu Telugu Movie Latest News, Latest Telugu Movies News, Mahesh Babu Dookudu Movie Latest Updates, Superstar Mahesh Babu Dookudu Telugu Movie Completes 8 Years, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు కెరీర్‌లో ప్ర‌త్యేకంగా నిల‌చిన చిత్రాల్లో `దూకుడు` ఒక‌టి. ముఖ్యంగా… `పోకిరి` (2006) వంటి ఇండ‌స్ట్రీ హిట్ త‌రువాత స‌రైన విజ‌యం లేని మ‌హేష్‌కి ఐదేళ్ళ త‌రువాత `దూకుడు` రూపంలో మ‌రో సెన్సేష‌న‌ల్ హిట్ ద‌క్కింది. శ్రీను వైట్ల దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్… ఆ ఏటి మేటి చిత్రంగా నిలవడమే కాకుండా బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపించింది. అలాగే… ఓవ‌ర్సీస్‌లోనూ సెన్సేష‌న్ క్రియేట్ చేసి అక్క‌డ వెరీ ఫ‌స్ట్‌ వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ టాలీవుడ్‌ ఫిల్మ్‌గా రికార్డుల‌కెక్కి ట్రెండ్ సెట్టింగ్ ఫిల్మ్ అనిపించుకుంది. అంతేకాదు… `దూకుడు` త‌రువాత దాదాపు మ‌హేష్ చిత్రాల‌న్నీ వ‌న్ మిలియ‌న్ డాల‌ర్ల క్ల‌బ్‌లో చేరి… అత‌న్ని `ఓవ‌ర్సీస్ కింగ్‌` చేశాయి. అలా… `దూకుడు` మ‌హేష్ కెరీర్‌లో వెరీ స్పెష‌ల్ మూవీ అయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

మహేష్‌కు జోడిగా సమంత నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, సోనూసూద్, తనికెళ్ళ భరణి, చంద్రమోహన్, నాజర్, ‘వెన్నెల’ కిషోర్, బ్రహ్మానందం, ఎం.ఎస్.నారాయణ, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కోట శ్రీనివాసరావు, షాయాజీ షిండే, సోనియా, ప్ర‌గ‌తి, బేబి శ్రియా శ‌ర్మ‌ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. పార్వతి మెల్టన్ ప్ర‌త్యేక గీతంలో న‌ర్తించింది.

యువ సంగీత సంచలనం థమన్ స్వరసారథ్యంలో రూపొందిన పాటలన్నీ విశేషాదరణ పొందాయి. “గురువారం మార్చి ఒకటి”, “చుల్ బులి చుల్ బులి”, “పూవై పూవై”, “నీ దూకుడు”, “దేత‌డి దేత‌డి”, “అదర అదర”… ఇలా ప్ర‌తీ పాట విశేషాద‌ర‌ణ పొందింది. 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట, అనిల్ సుంక‌ర సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం… మ‌హేష్‌ను మ‌రోసారి `నంది` `ఉత్త‌మ న‌టుడు`గా నిలిపింది. అలాగే ప‌లు పుర‌స్కారాల‌ను కైవ‌సం చేసుకుంది. కన్నడంలో ‘పవర్’ పేరుతోనూ, బెంగాలీలో ‘ఛాలెంజ్ 2’ టైటిల్‌తోనూ ఈ సినిమా రీమేక్ అయ్యింది. 2011 సెప్టెంబర్ 23న విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న `దూకుడు’… నేటితో 8 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen + 4 =