మహేష్ కోసం 16 ఏళ్ళ తరువాత..!

Ionic Location Recreated For Mahesh Babu Sarileru Neekevvaru,#SarileruNeekevvaru, latest telugu movies news, Mahesh Babu Sarileru Neekevvaru Movie Shooting Latest News, Sarileru Neekevvaru Heads To Kurnool, Sarileru Neekevvaru Movie Shooting Updates, Sarileru Neekevvaru Movie Updates, Sarileru Neekevvaru Telugu Movie Latest News, Sarileru Neekevvaru Telugu Movie Shooting Latest News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

గుణ శేఖర్ దర్శకత్వంలో మహేష్ బాబు, భూమిక హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు . మహేష్ బాబు కెరీర్ కే టర్నింగ్ పాయింట్ అయిన సినిమా. అంతేకాదు తెలుగు ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్ చేసిన సినిమా. ఇక ఈ సినిమాలో కర్నూల్ కొండరెడ్డి బురుజు కూడా అప్పట్లో పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ కూడా అయింది. ఈ లొకేషన్ సిల్వర్ స్క్రీన్ పై ఒక ఐకానిక్ గా నిలిచింది. ఇక ఇప్పుడు ఈ లొకేషన్ ను ఇన్నేళ్ల తర్వాత మళ్ళీ మహేష్ సినిమా కోసం వాడుతున్నాడు అనిల్ రావిపూడి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనిల్ రావిపూడి, మహేష్ బాబు కాంబినేషన్ లో మొదలైన ‘సరిలేరు నీకెవ్వరు’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్‌లో శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా కోసం కర్నూల్ కొండా రెడ్డి బురుజును హైదరాబాద్ కు తీసుకొచ్చారు. 16 ఏళ్ళ తర్వాత ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా రామోజీ ఫిలిం సిటీ లో సెట్ వేసారు. ఇక ఈ విషయాన్నీ డైరెక్టర్ అనిల్ రావిపూడి తన ట్విట్టర్ ద్వారా తెలిపాడు. 16 సంవత్సరాల క్రితం ఈ కట్టడం(కొండారెడ్డి బురుజు) సిల్వర్ స్క్రీన్ మీద రికార్డును క్రియేట్ చేసింది. ఇప్పుడు అదే కట్టడం వద్ద మరో హిట్ కోసం సిద్ధమవుతున్నాం. మా ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాష్ గారు ఈ కట్టడాన్ని అద్భుతంగా రూపొందించారు. కర్నూల్ కొండారెడ్డి బురుజును ఆయన ఫిలిం సిటీకి తీసుకొచ్చారు’’ అంటూ అనిల్ రావిపూడి కామెంట్ పెట్టాడు.

ఇక రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఇంకా విజయశాంతి, రాజేంద్ర ప్రసాద్ కీలక పాత్రలో నటిస్తున్నారు. అనిల్ సుంకర, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈ సినిమాను విడుదలచేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇక మహేష్ మొదటిసారి ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనుండటంతో చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలున్నాయి. మరి ఈ సినిమాతో మహేష్, అనిల్ రావిపూడి మరో హిట్ కొడతారేమో చూద్దాం..

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.