శివాత్మికపై కృష్ణవంశీ ప్రశంసలు

Director Krishna Vamsi Latest News, Director Krishna Vamsi New Movie News, Krishna Vamsi Hails Shivathmika, Krishna Vamsi Impressed With Shivatmika Rajasekhar, Krishna Vamsi in awe of heros daughter, Krishna Vamsi Upcoming Film News, Latest Telugu Movies News, Rajasekhar Daughter Sivathmika In Krishna Vamsi, Shivatmika is Super Sharp Bundle of Talent – Krishna Vamsi, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates

నానా పాటేకర్ హీరోగా నటించిన మరాఠీ మూవీ ‘నట సమ్రాట్’ సినిమాను తెలుగులో ‘రంగమార్తాండ’గా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాశ్ రాజ్ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కుతుంది.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో రాజశేఖర్‌ తనయ శివాత్మిక కూడా నటిస్తుంది. ‘దొరసాని’ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన శివాత్మిక మొదటి సినిమాతోనే తన నటనతో మంచి పేరును తెచ్చుకుంది. ఇప్పుడు ఈ సినిమాలో శివాత్మిక ఓ కీలక పాత్రను పోషిస్తుంది. ఈ సందర్భంగా షూటింగ్‌ లొకేషన్‌లో తీసిన ఆమె ఫొటోను ట్విట్టర్‌ ద్వారా అభిమానులతో పంచుకున్నారు కృష్ణవంశీ. ‘నైపుణ్యం, చురుకుదనం, ప్రతిభాసంపత్తులు కలిగిన ఇద్దరూ లెజెండ్స్‌ కి కూతురైన శివాత్మికతో సినిమా చేయడం ఆనందంగా ఉంది’ అని తెలిపారు.

ఇంకా ఈ సినిమాలో రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన పాత్రలలో నటిస్తుండగా.. అనసూయ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక ‘అంతఃపురం’ సినిమాకు మ్యూజిక్ అందించిన ఇళయరాజా మరోసారి ఈ సినిమాకు సంగీతం అందించనున్నారు. చాలా ఏళ్ళ తరువాత ఇప్పుడు మ‌రోసారి వీరిద్ద‌రూ జ‌ట్టు క‌ట్టారు.

టాలీవుడ్‌లో క్రియేటివ్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్న కృష్ణవంశీ.. గతకొద్ది కాలంగా ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయిన సంగతి తెలిసిందే. ‘చందమామ’ తర్వాత ఆ స్థాయి హిట్టు ఇవ్వలేకపోయాడు. మరి ఈ సినిమాతో అయినా మళ్ళీ ఫామ్ లోకి వస్తాడేమో చూద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 + 1 =