ఉదయనిధి స్టాలిన్, నిత్యా మీనన్, అదితీరావు హైదరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు మిస్కిన్ తెరకెక్కించిన సైకలాజికల్ థ్రిల్లర్ తమిళ చిత్రం ‘సైకో’. నిజానికి ఈ సినిమాను డిసెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రిలీజ్ డేట్ మారినట్టు తెలుస్తుంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగాప్రకటించారు. జనవరి 24వ తేదీన ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
#PsychoFromJan24#PsychoTheMovie#Mysskin ‘s violent poem. #Ilaiyaraaja @UdhayStalin @ManickamMozhi @AditiRaoHydari @MenenNithya pic.twitter.com/MnfJqSSdj3
— iQlik Movies (@iqlikmovies) December 21, 2019
డబుల్ మీనింగ్ ప్రొడక్షన్స్ పతాకంపై అరుణ్ మోళి మాణిక్యం నిర్మిస్తున్న ఈ సినిమాకు మ్యూజిక్ మేస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. మరి ఉదయనిధి స్టాలిన్ అంధుడి పాత్రలో కనిపించనుండగా… అదితిరావు హైదరి రేడియో జాకీగా దర్శనమివ్వనుంది. మరి… రెండేళ్ళ క్రితం ‘తుప్పరివాలన్’ తో మంచి విజయాన్ని అందుకున్న మిస్కిన్… ఇప్పుడు ‘సైకో’తో కూడా విజయం అందుకుంటాడేమో చూడాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: