లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై AR మురుగదాస్ దర్శకత్వంలో తమిళ సూపర్ స్టార్, తలైవా రజనీకాంత్ హీరోగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ దర్బార్ తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ సంక్రాంతి కానుకగా జనవరి 14 వ తేదీ రిలీజ్ కానున్నాయి. రజనీకాంత్ పోలీస్ ఆఫీసర్ గా నటించిన దర్బార్ మూవీ లో నయనతార కథానాయిక. బాలీవుడ్ స్టార్ హీరో సునీల్ శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. నివేత థామస్ , ప్రతీక్ బబ్బర్, యోగి బాబు ముఖ్య పాత్రలలో నటించారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రపంచవ్యాప్తంగా అభిమాన గణం ఉన్న రజనీకాంత్ 27 సంవత్సరాల తరువాత పోలీస్ ఆఫీసర్ గా ఈ మూవీ లో నటించడం విశేషం. ఇప్పటివరకూ చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన దర్బార్ మూవీ పోస్టర్స్ ప్రేక్షక, అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దీపావళి పండుగ సందర్భంగా దర్బార్ మూవీ కొత్త పోస్టర్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. గన్ తో స్టైలిష్ గా ఉన్న రజనీకాంత్ పోస్టర్ ప్రేక్షకులను ఇంప్రెస్ చేసింది. ముంబై బ్యాక్ డ్రాప్ లో భారీ బడజేత్ తో రూపొందిన దర్బార్ మూవీ కై ప్రేక్షక, అభిమానులు ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: