విజయ్ దేవరకొండ నిర్మాతగా.. తరుణ్ భాస్కర్ హీరోగా కింగ్ ఆఫ్ ద హిల్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్ తో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి టీజర్, ట్రైలర్ లను రిలీజ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నవంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది.సెన్సార్ బోర్డువారు ఈ సినిమాకి U/A సర్టిఫికేట్ ను మంజూరు చేశారు.
కాగా ఈ సినిమాకు కొత్త డైరెక్టర్ షమ్మిర్ దర్శకత్వం వహిస్తుండగా…ఇందులో అనసూయ భరద్వాజ్, అభినవ్ గోమటం, పావని గంగిరెడ్డి, నవీన్ జార్జ్ థామస్, వాణి భోజన్ ఇతర కీలక పాత్రలు చేస్తున్నారు. మరి చూద్దాం పెళ్లి చూపులు సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ఈ కాంబినేషన్ ఈ సినిమాతో మరో హిట్ కొడుతుందో..?లేదో..?
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: