విజయ్ దేవరకొండకు జోడీగా జాన్వీ.. పూరీ మాస్టర్ ప్లాన్

Happening Beauty To Pair Up With Vijay Deverakonda,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Vijay Deverakonda New Movie Updates,Janhvi Kapoor to Pairup with Vijay Deverakonda?

విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం విజయ్ క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో వున్న ఈ సినిమాను డిసెంబర్ లో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ సినిమా అయిపోయిన తర్వాత పూరీ-విజయ్ కంబినేషన్లో సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ఫైటర్ అనే టైటిల్ ను ఈ సినిమాకు పెట్టనున్నట్టు తెలుస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఈ సినిమాతోనే పూరీ ఓ మాస్టర్ ప్లాన్ వేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ చిత్రంలో హీరోయిన్ గా అలనాటి అందాల తార దివంగత శ్రీదేవి కూతురు జాన్వీని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడట. ఇప్పటికే జాన్వీ విజయదేవరకొండతో నటించాలని ఉంది అని ‘కాఫీ విత్ కరణ్’ ప్రోగ్రాంలో చెప్పడంతో.. తను కూడా ఒప్పుకునే ఛాన్స్ ఉండొచ్చని ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఒకవేళ జాన్వీ కనుక ఎస్ అంటే ఈ చిత్రాన్ని తెలుగు – హిందీ భాషల్లో తెరకెక్కించాలని భావిస్తున్నాడు.

అంతేకాదు ఒకే దెబ్బకి రెండు పిట్టలు అన్నట్టు.. ఒకవేళ జాన్వీ కనుక ఒప్పుకుంటే.. తనకు సల్మాన్ తో సినిమా చేయడం కూడా కాస్త ఈజీ అవుతుందని భావిస్తున్నాడట. మరి చూద్దాం ఇవన్నీ కేవలం వార్తలు గానే మిగిలిపోతాయా..? లేక నిజమవుతాయా..?

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

sixteen − seven =