వైవిధ్యభరితమైన పాత్రలకు చిరునామాగా నిలుస్తున్న తమిళ నటుడు విజయ్ సేతుపతి. కేవలం కథానాయకుడి పాత్రలకే పరిమితం కాకుండా పలు విలక్షణ భూమికల్లో నటిస్తూ ముందుకు సాగుతున్నాడు విజయ్. కాగా, ఇటీవల మెగాస్టార్ చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్ `సైరా నరసింహారెడ్డి`తో తెలుగునాట గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన సేతుపతి… ప్రస్తుతం చిరు మేనల్లుడు, సాయితేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ డెబ్యూ ఫిల్మ్ `ఉప్పెన`లో ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. అంతేకాదు… మరో మెగా కాంపౌండ్ హీరోతోనూ విజయ్ సేతుపతి కలసి నటించబోతున్నట్లు సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… `ఆర్య`, `ఆర్య 2` తరువాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, బ్రిలియంట్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఎర్రచందనం అక్రమ రవాణా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రంలో విజయ్ సేతుపతి విలన్గా నటించబోతున్నాడని టాక్. కథానాయకుడి పాత్రకి దీటుగా ఈ క్యారెక్టర్ ఉంటుందని తెలిసింది. త్వరలోనే విజయ్ ఎంట్రీ పై క్లారిటీ వచ్చే అవకాశముంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: