ఒకవైపు కథానాయకుడిగా నటిస్తూనే మరోవైపు భారీ బడ్జెట్ చిత్రాల నిర్మాతగానూ రాణిస్తున్నాడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్. ఈ ఏడాది `వినయ విధేయ రామ`తో హీరోగానూ, `సైరా నరసింహారెడ్డి`తో ప్రొడ్యూసర్‌గానూ రెండు విభిన్న ప్రయత్నాలతో పలకరించాడు ఈ టాలెంటెడ్ స్టార్. అంతేకాదు… ఒకవైపు `ఆర్ ఆర్ ఆర్` వంటి క్రేజీ మల్టీస్టారర్‌లో నటిస్తూనే, మరోవైపు తన తండ్రి, మెగాస్టార్ చిరంజీవి 152వ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. అలాగే మలయాళ బ్లాక్‌బస్టర్ `లూసిఫర్` రీమేక్ రైట్స్ సొంతం చేసుకుని చిరుతోనే ఆ సినిమాని నిర్మించే ప్రయత్నం చేస్తున్నాడు. కాగా…. ఇటీవల ఈ మూడు సినిమాల(`ఆర్ ఆర్ ఆర్`, చిరు 152, `లూసిఫర్` రీమేక్)కు సంబంధించి వినిపిస్తున్న రకరకాల రూమర్స్‌కు చరణ్ చెక్ పెట్టాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
యస్.యస్. రాజమౌళి డైరెక్టోరియల్ `ఆర్ ఆర్ ఆర్` షెడ్యూల్స్ లో కొన్ని అంతరాయాలు చోటుచేసుకోవడంతో… సదరు హిస్టారికల్ ఫిక్షన్ మొదట అనుకున్న తేది (2020 జూలై 30)కి కాకుండా 2021 వేసవికి వాయిదా పడే అవకాశముందని ఆమధ్య పలు కథనాలు వచ్చాయి. దీనికి తాజా ఇంటర్వ్యూలో చరణ్ క్లారిటీ ఇచ్చాడు. వచ్చే ఏడాది జూలై 30నే ఈ సినిమా వస్తుందని, వాయిదా పడే అవకాశం లేదని చెప్పుకొచ్చాడు. ఇక చిరు – కొరటాల కాంబినేషన్లో వస్తున్న చిత్రంలో చిరు యంగ్ వెర్షన్‌లా చరణ్ కనిపిస్తాడనే వార్తలు, అలాగే `లూసిఫర్` రీమేక్‌లో చిరుతో పాటు చరణ్ కూడా నటిస్తాడన్న కథనాలు కూడా అవాస్తవమేనని తన మాటల్లో తేలింది. మొత్తానికి… ఒకే ఇంటర్వ్యూలో మూడు క్రేజీ ప్రాజెక్టులకు సంబంధించిన రూమర్స్‌పై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు చరణ్.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: