కొర‌టాల ద‌ర్శ‌క‌త్వంలో చ‌ర‌ణ్ నెక్ట్స్ ప్రాజెక్ట్‌?

Ram Charan Colloborates With Koratala Shiva For His Next Project,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Koratala Shiva Next Upcoming Project,Director Koratala Shiva New Movie,Ram Charan Colloborates With Koratala Shiva

గ‌త ఏడాది `రంగ‌స్థ‌లం` రూపంలో సంచ‌ల‌న విజ‌యం అందుకున్నాడు మెగాప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌. అయితే, ఆ త‌రువాత వ‌చ్చిన `విన‌య విధేయ రామ‌` నిరాశ‌ప‌రిచినా… ఆరంభ వ‌సూళ్ళ ప‌రంగా చ‌ర‌ణ్ స్టామినాని చెప్ప‌క‌నే చెప్పింది. ప్ర‌స్తుతం ద‌ర్శ‌క‌ధీరుడు య‌స్‌.య‌స్‌. రాజ‌మౌళి రూపొందిస్తున్న క్రేజీ మ‌ల్టీస్టార‌ర్ `ఆర్ ఆర్ ఆర్‌`లో… యంగ్ టైగ‌ర్ య‌న్టీఆర్‌తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్నాడు ఈ కొణిదెల వారి రెండో త‌రం క‌థానాయ‌కుడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… `ఆర్ ఆర్ ఆర్‌` త‌రువాత చ‌ర‌ణ్ చేయ‌బోయే సినిమాపై క్లారిటీ వ‌చ్చింది. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో చెర్రీ నెక్ట్స్ వెంచ‌ర్ ఉంటుంద‌ని స‌మాచారం. ప్ర‌స్తుతం… మెగాస్టార్ చిరంజీవి క‌థానాయ‌కుడిగా కొర‌టాల ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెర‌కెక్కిస్తున్న సంగ‌తి తెలిసిందే. 2020 ఉగాదికి ఈ భారీ బ‌డ్జెట్ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఆ చిత్రం విడుద‌ల‌య్యాకే చ‌ర‌ణ్‌, కొర‌టాల కాంబినేష‌న్ మూవీ ప్రారంభ‌మ‌వుతుంద‌ని స‌మాచారం.

వాస్త‌వానికి, ఆరేళ్ళ క్రిత‌మే చ‌ర‌ణ్ – కొర‌టాల కాంబోలో ఓ సినిమా రావాల్సి ఉంది. ప్రారంభోత్స‌వం కూడా జ‌రుపుకున్న స‌ద‌రు ప్రాజెక్ట్ అనివార్య కార‌ణాల వ‌ల్ల ఆగిపోయింది. ఎట్ట‌కేల‌కు ఈ కాంబినేష‌న్ సెట్ అవుతుండ‌డం విశేషం. త్వ‌ర‌లోనే చ‌ర‌ణ్‌, కొర‌టాల కాంబో మూవీపై అధికారిక ప్ర‌క‌ట‌న వ‌స్తుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − 3 =