మొత్తానికి వరుస ప్లాప్స్ తో కాస్త ఫామ్ తగ్గిన రామ్ కు పూరి ఇస్మార్ట్ శంకర్ తో మంచి హిట్ ఇచ్చి ఫామ్ లోకి తెచ్చాడు. ఇక ఈసారి కథ ఎంపికలో ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఫైనల్ గా మరో కొత్త సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. తమిళంలో సూపర్ హిట్ అయిన ‘తడం’ సినిమాను తెలుగులో రీమేక్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా ఈరోజు చిత్ర టైటిల్ అండ్ పోస్టర్ విడుదల చేస్తామని రామ్ స్వయంగా నిన్న సోషల్ మీడియాలో తెలిపాడు. ఇక తాజాగా తన కొత్త సినిమా టైటిల్ మరియు ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.
💥!! #RED !!💥
This one is going to be…So-Bloody-Different! 🔥#REDTheFilm #RAPO18 #RAPO18FIRSTLOOK pic.twitter.com/4jXhicUyrK
— RAm POthineni (@ramsayz) October 28, 2019
కాగా స్రవంతి రవి కిషోర్ ఈ చిత్రాన్ని నిర్మించనున్న ఈ సినిమాకు మెలోడీ బ్రహ్మ మణిశర్మ సంగీతం అందించనున్నారు. మిగిలిన నటీనటులు వివరాలు తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.
ఇక రామ్ – కిషోర్ తిరుమల కాంబినేషన్ ఇది మూడో చిత్రం. మొదటి చిత్రం నేను శైలజ హిట్ అవ్వగా, రెండో సినిమా ఉన్నది ఒకటే జిందగీ బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తాకొట్టింది. ఇప్పుడు మరోసారి కలిసి వస్తున్నారు. మరి ఈ సినిమా ఎంత వరకూ సక్సెస్ తెచ్చి పెడుతుందో చూద్దాం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: