హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో నిశ్శబ్దం మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా తెలుగు లో నిశ్శబ్ధం టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా.. నిన్న దీపావళి సందర్భంగా ప్రీ టీజర్ ను రిలీజ్ చేశారు. ఇంట్రస్టింగ్ థీమ్ మ్యూజిక్ తో పాటు బ్యూటిఫుల్ విజువల్స్ ఒక్కొక్కరి క్యారెక్టర్స్ ను చూపించిన విధానం బావుంది. ప్రీ టీజర్ నెటిజన్లను బాగానే ఆకట్టుకుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. నవంబర్ 7వ తేదీన ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయనున్నారు.
ఇక ఈ సినిమాలో మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్, వివేక్ కూచిభొట్ల, కోన వెంకట్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు గోపిసుందర్ సంగీతం అందిస్తున్నాడు. పూర్తిగా US లోనే ఈ సినిమా షూటింగ్ జరుపుకోవడం మరో విశేషం.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: