తొలి ప్రేమ, బద్రి, ఖుషి , జల్సా, గబ్బర్ సింగ్, అత్తారింటికి దారేది వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన మేనరిజం, డైలాగ్ డెలివరీ తో అలరించిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ప్రేక్షకులకు, అభిమానులకు విపరీతమైన క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. అజ్ఞాత వాసి మూవీ తరువాత సినిమాలకు దూరమై ప్రజా సేవ కై జనసేన పార్టీ అధ్యక్షుడు గా పూర్తి స్థాయిలో రాజకీయ నాయకుడిగా పవన్ కళ్యాణ్ మారారు. ప్రేక్షక, అభిమానుల కోరిక పై సినిమాలలో రీ ఎంట్రీ కై పవన్ కళ్యాణ్ సుముఖంగా ఉన్నారని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
విభిన్న కథాంశాలతో మూవీస్ తెరకెక్కించే దర్శకుడు క్రిష్ స్క్రిప్ట్ కు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. క్రిష్ దర్శకత్వంలో రూపొందే ఫోక్ జానర్ మూవీ తో పవన్ కళ్యాణ్ ఎంట్రీ అవుతారు. మెసేజ్ తో కూడుకున్న పీరియాడిక్ డ్రామా గా రూపొందనున్న ఈమూవీ వందల సంవత్సరాల క్రితం జరిగిన నిజ సంఘటనల ఆధారంగా జానపద మూవీ గా రూపొందనుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ జానర్ మూవీ లో నటించడం మొదటిసారి. తమ అభిమాన హీరో పవన్ కళ్యాణ్ తిరిగి మూవీస్ లోనటించడంఅభిమానులకు సంతోషదాయకమే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: