త్వరలో సెట్స్ పైకి బన్నీ-సుకుమార్ మూవీ..!

Allu Arjun Trivikram Movie To Hit Sets Soon,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Allu Arjun Next Movie with Director Trivikram,Trivikram Upcoming Projects,Allu Arjun Trivikram Movie

త్రివిక్రమ్-అల్లు అర్జున్ కాంబినేషన్ లో ‘అల వైకుంఠపురములో’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక ఈ సినిమాను సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో… ఇక ఒకపక్క షూటింగ్ జరుపుకుంటూనే మరో పక్క చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలు స్టార్ట్ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే ఈ సినిమా నుండి పలు పోస్టర్స్ ను.. పాటలను రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ‘సామజవరగమన.. నిను చూసి ఆగగలనా’, ‘రాములో రాములా’ పాటలను రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఈ సినిమా తర్వాత బన్నీ సుకుమార్ తో చేయనున్న సంగతి కూడా విదితమే. ఈ నేపథ్యంలో ఈ సినిమాను త్వరలో సెట్స్ పైకి తీసుకెళ్లనున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఈ సినిమా పూజా కార్యక్రమాలు అక్టోబర్ మొదటి వారంలోనే నిర్వహించాలని అనుకున్నారు. కానీ అది కుదరలేదు. దీనితో ఇప్పుడు సుకుమార్ మరో ముహూర్తం పెట్టినట్టు తెలుస్తుంది. మరో పది రోజుల్లో సుకుమార్ ఈ సినిమాను లాంచ్ చేయనున్నాడట. ఆ తర్వాత రెగ్యులర్ షూట్ ను మొదలపెట్టనున్నాడట. అయితే ఈ సినిమాలో ఫుల్ గడ్డంతో అల్లు అర్జున్ లుక్ ఉండటంతో.. ఆ మేక్ ఓవర్ కోసం టైం తీసుకుంటాడట. దానితో అల్లు అర్జున్ మాత్రం జనవరి నుండి షూటింగ్ లో పాల్గొంటాడట.ఆ గ్యాప్ లో సుకుమార్ మిగిలిన నటీనటులతో షూటింగ్ జరపనున్నాడట. మరి చూద్దాం ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన ఎప్పుడు వస్తుందో..!

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 4 =