మోస్ట్ వ్యూడ్ సౌత్ ఇండియ‌న్ సాంగ్‌గా `రాములో రాములా`

Ramulo Ramula Song Latest Chartbusters On Internet,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Ramulo Ramula Song,Ramulo Ramula Full Song,Allu Arjun Ramulo Ramula Song,Ala Vaikunthapuramulo Songs

`అల వైకుంఠ‌పుర‌ములో`… స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నుంచి రాబోతున్న ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌. త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్… సంక్రాంతికి ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. కాగా, సినిమా విడుద‌ల‌కి ఇంకా స‌మ‌య‌మున్నా చిత్ర యూనిట్ అప్పుడే ప్రచార‌ప‌ర్వానికి శ్రీ‌కారం చుట్టింది. పాట‌ల‌తో త‌మ చిత్రంపై అటెన్ష‌న్ క్రియేట్ చేస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఫ‌స్ట్ సింగిల్‌గా విడుద‌లైన `సామ‌జ‌వ‌ర‌గ‌మ‌న‌` ఇప్ప‌టికే 50 మిలియ‌న్ల‌కి పైగా వ్యూస్‌తో ముందుకు సాగుతూ… మోస్ట్ లైక్డ్ తెలుగు సాంగ్‌గా రికార్డుల‌కెక్కితే… తాజాగా విడుద‌లైన సెకండ్ సింగిల్ `రాములో రాములా` మ‌రో రికార్డుని సొంతం చేసుకుంది. తొలి 24 గంట‌ల్లో అత్య‌ధిక వ్యూస్ (8.3 మిలియ‌న్ వ్యూస్‌) పొందిన ద‌క్షిణాది పాట‌గా చ‌రిత్ర సృష్టించింది. మ‌రి… ఇదే ఊపులో సినిమా కూడా సెన్సేష‌న్ క్రియేట్ చేస్తుందేమో చూడాలి.

`అల వైకుంఠ‌పుర‌ములో` చిత్రంలో పూజా హెగ్డే నాయిక‌గా న‌టిస్తుండ‌గా… థ‌మ‌న్ సంగీత‌మందిస్తున్నాడు. గీతా ఆర్ట్స్‌, హారికా అండ్ హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

3 × three =