మెగాస్టార్ చిరంజీవి కెరీర్‌ని మేలిమ‌లుపు తిప్పిన `ఖైదీ`కి 36 ఏళ్ళు

Megastar Milestone Movie Khaidi Completes 36 Years,Latest Telugu Movies News, Telugu Film News 2019, Telugu Filmnagar, Tollywood Cinema Updates,Khaidi Completes 36 Years,36 Years of Khaidi Movie,Megastar Khaidi Movie Completes 36 Years,Khaidi Telugu Movie

నాలుగు ద‌శాబ్దాల మెగాస్టార్ చిరంజీవి న‌ట‌నాప్ర‌స్థానంలో ఎన్నో బ్లాక్‌బ‌స్ట‌ర్స్‌, మ‌రెన్నో సూప‌ర్ హిట్స్ ఉన్నాయి. ఇక ఇండ‌స్ట్రీ హిట్స్ సంగ‌తి స‌రేస‌రి. అయితే, క‌థానాయ‌కుడిగా చిరు ద‌శ‌ను, దిశ‌ను మేలిమ‌లుపు తిప్పిన చిత్రం మాత్రం ఒక‌టుంది. అదే… `ఖైదీ`. అంత‌కుముందు ఈ కొణిదెల `కొద‌మ‌సింహం` న‌టించిన అర‌వై చిత్రాలు ఒకెత్తు అయితే, `ఖైదీ` మ‌రో ఎత్తు. ప‌గ‌, ప్ర‌తీకారాల‌తో ర‌గిలిపోయే సూర్యం పాత్ర‌లో సూర్యుడిలా వెలిగిపోయారు ఈ న‌ట‌శిఖ‌రం. ఆపై తెలుగువారి గుండెల్లో అభిమాన‌పాత్రుడైన `ఖైదీ`గా స్థిర‌ప‌డిపోయారు. మొత్త‌మ్మీద‌… `ఖైదీ`కి ముందు, `ఖైదీ`కి త‌రువాత అన్నంత‌గా చిరు కెరీర్‌పై ప్ర‌భావం చూపింది ఈ సంచ‌ల‌న ప్ర‌తీకార చిత్రం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఎ.కోదండ‌రామిరెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో సంయుక్తా మూవీస్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో చిరుకి జోడీగా మాధ‌వి, సుమ‌ల‌త న‌టించ‌గా, కీల‌క పాత్ర‌ల్లో రావుగోపాల రావు, సంగీత‌, రంగ‌నాథ్ ద‌ర్శ‌న‌మిచ్చారు. చ‌క్ర‌వ‌ర్తి సంగీత‌సార‌థ్యంలో రూపొందిన పాట‌ల‌న్నీ మాస్‌ని ఉర్రూత‌లూగించాయి. ముఖ్యంగా `ర‌గులుతోంది మొగ‌లిపొద‌`, `వేదం నాదం`, `గోరింట పూసింది`, `ఇదేమిట‌బ్బా` అప్ప‌ట్లో సంచ‌ల‌నం సృష్టించాయి. 1983 అక్టోబ‌ర్ 28న విడుద‌లై బాక్సాఫీస్ ముంగిట బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిల‌చిన `ఖైదీ`… నేటితో 36 వ‌సంతాల‌ను పూర్తిచేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

ten + 8 =