ఖైదీ డైరెక్టర్ కోసం క్యూ కట్టిన స్టార్ హీరోలు

Star Heroes Want To Work With Khaidi Director,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2019,Tollywood Cinema Updates,Khaidi Director Upcoming Movie With Star Heroes,Khaidi Director Latest News,Khaidi Director Upcoming Film Updates,Khaidi Director New Movie News

దర్శకుడు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో కార్తి ప్రధాన పాత్రలో తెరకెక్కిన సినిమా ‘ఖైదీ’. డ్రీమ్‌ వారియర్‌ పిక్చర్స్‌ పతాకంప ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా వచ్చిన ఈ సినిమా… దీపావళి కానుకగా అక్టోబర్ 25న రిలీజ్ అయి.. తొలి షో నుంచి సూపర్‌ హిట్ టాక్‌తో దూసుకుపోతుంది. తమిళ్‌తో పాటు తెలుగు ఆడియన్స్‌ను కూడా విపరీతంగా ఆకట్టుకుంటోంది. రిలీజయి రెండు భాషలలోను ఘనవిజయం సాధించింది. ఇక వసూళ్ళ పరంగా కూడా ఈ సినిమా రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే. తమిళ నాడు లో 25 కోట్లకు పైగా కలెక్ట్ చేసి… ప్రపంచవ్యాప్తంగా 50 కోట్లు కలెక్ట్ చేసి 50 కోట్ల క్లబ్ లో చేరింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమా లో నటించిన కార్తీకు, ఇంత బాగా తీసిన దర్శకుడు లోకేష్ కనగరాజ్ కు విమర్శకుల ప్రసంశలు సైతం దక్కాయి. దీనితో వరుస ప్లాప్స్ తో కాస్త వెనుక పడిన కార్తీకి కాస్త ఊరట లభించింది. ఇక డైరెక్టర్ కానగరాజ్ లక్ మాత్రం మారిపోయింది. అందుకే ఆయనతో సినిమాలు చేయడానికి స్టార్ హీరోలు ఆసక్తిని చూపుతున్నారు.

ఇప్పటికే ‘ఖైదీ’ సినిమాకి హిట్ టాక్ వచ్చిన వెంటనే, ఈ సినిమాకి సీక్వెల్ ఉంటుందని కార్తీ ఎనౌన్స్ చేసేశాడు. మరోవైపు లోకేశ్ కనగరాజ్ తో విజయ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా త్వరలో సెట్స్ పైకి వెళ్లనుంది. సూర్య కూడా లోకేశ్ కనగరాజ్ తో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఇప్పటికే వార్తలు వచ్చాయి. ఇక ఇప్పుడు మరో వార్త వినిపిస్తుంది. ఈ జాబితాలో కమల్ కూడా చేరిపోయారనేది తాజా సమాచారం. తన సొంత బ్యానర్లో ఒక సినిమా చేయమని భారీ ఆఫర్ ఇచ్చినట్టుగా కోలీవుడ్లో టాక్స్ వినిపిస్తున్నాయి. మరి వీటిలో లోకేశ్ కనగరాజ్ ముందుగా ఏ ప్రాజెక్టును సెట్స్ పైకి తీసుకెళతాడో..? మరి ఇందులో ఎంతమందితో నిజంగానే సినిమా చేస్తున్నాడో తెలియాలంటే కొద్దిరోజులు వెయిట్ చేయాల్సిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 4 =