మెగాఫ్యామిలీకి అచ్చొచ్చిన దర్శకుల్లో సురేందర్ రెడ్డి ఒకరు. `రేసు గుర్రం` రూపంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కి, `ధృవ`తో మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌కి… తాజాగా `సైరా నరసింహారెడ్డి` రూపంలో మెగాస్టార్ చిరంజీవికి మెమరబుల్ మూవీస్ అందించిన వైనం సూరి సొంతం. ఈ నేపథ్యంలో… త్వరలో మరో మెగాహీరోతో జట్టుకట్టేందుకు సిద్ధమవుతున్నాడట ఈ టాలెంటెడ్ డైరెక్టర్. ఆ హీరో మరెవరో కాదు … మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
వాస్తవానికి సురేందర్ రెడ్డి తదుపరి చిత్రం యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌తో ఉంటుందనే వార్తలు వినిపించాయి. అయితే, వచ్చే ఏడాది చివరి వరకు ప్రభాస్ కాల్షీట్స్ కోసం వేచిచూడాల్సిన పరిస్థితి ఉండడంతో… ఈ లోపు వరుణ్‌తో సినిమా ప్లాన్ చేస్తున్నాడట సూరి. త్వరలోనే ఈ కాంబినేషన్‌పై మరింత క్లారిటీ వచ్చే అవకాశముంది. `ధృవ`, `సైరా`… ఇలా వరుసగా రెండు సినిమాలను మెగాకాంపౌండ్‌లోనే చేసిన సూరి… ఇప్పుడు అదే క్యాంప్‌లో హ్యాట్రిక్‌కి సిద్ధమవుతుండడం విశేషమనే చెప్పాలి.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: