
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 8


సెన్సార్ పూర్తి చేసుకున్న 'నీకోసం'


సాహో నాలుగు రోజుల కలెక్షన్స్

సాహో దర్శకుడు సుజీత్ పాత జ్ఞాపకాలు
ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్
సాహో , ఎవరు మూవీస్ పై KTR ప్రశంసలు

ఒక్క రోజు గ్యాప్‌లో రానున్న ‘ఈగ’ స్టార్స్

వరుస చిత్రాలతో పాయల్ రాజ్ పుత్ సందడి

చిరంజీవి `స్వయంకృషి`కి 32 ఏళ్ళు

తనకు తానే పోటీగా పరిణమించిన ప్రభాస్ ప్రభంజనం

మరోసారి ఖాకీలో వెంకీ?

నవంబర్ నుంచి చిరు, కొరటాల చిత్రం?

కోలీవుడ్ పై కన్నేసిన బన్నీ..?

మరో మిషన్ కు సిద్దమైన తాప్సీ

బ్లాక్ బస్టర్ ఆఫ్ ది ఇయర్
యు వి క్రియేషన్స్, టి - సిరీస్ బ్యానర్స్ పై యంగ్ డైరెక్టర్ సుజీత్ దర్శకత్వంలో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్, శ్రద్ధా కపూర్ జంటగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ రిలీజయి కలెక్షన్స్ పరంగా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. మిక్స్డ్ టాక్ తో ప్రదర్శించబడుతున్న సాహో మూవీ మొదటి రోజు ప్రపంచవ్యాప్తంగా 125 కోట్లు కలెక్ట్ చేసింది. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తరువాత ఫస్ట్ డే కలెక్షన్స్ లో సెకండ్ బిగ్గెస్ట్ ఓపెనర్ గా సాహో మూవీ నిలిచింది .

వాల్మీకి లో సర్ ప్రయిజ్ ఇవ్వనున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్..?
హరీష్ శంకర్ దర్శకత్యంలో వాల్మీకి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 6న రిలీజ్ చేద్దామనుకున్నారు... కానీ సాహో మేనియా వల్ల సెప్టెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు.

సెన్సార్ పూర్తి చేసుకున్న 'నీకోసం'
అవినాష్ కోకటి దర్శకత్వం లో అరవింద్ రెడ్డి, సుభాంగి పంత్, అజిత్ రాధారమ్, దీక్షితా పార్వతి ప్రధాన పాత్రలలో నటిస్తున్న సినిమా 'నీ కోసం'. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుకుంటుంది. ఇక ఇటీవలే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేయగా... దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా సెన్సార్ ను పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ను అందించింది.

పీటర్ హెయిన్స్ దర్శకత్వంలో నల్లమలుపు శ్రీనివాస్ ( బుజ్జి) నిర్మాతగా సినిమా!
పీటర్ హెయిన్స్... పరిచయం అక్కర్లేని పేరు. గౌతమ్ మీనన్ `చెలి`తో ఫైట్ మాస్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన కృష్ణవంశీ దర్శకత్వంలో `మురారి`తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత `అపరిచితుడు`, `శివాజీ`, `గజిని`, `మగధీర`, `రోబో`, `విలన్`, `విక్రమ సింహ`, `బాహుబలి`, `మన్యం పులి`...ఇలా ఎన్నో సినిమాలకు ఆయన స్టంట్ మాస్టర్ గా పని చేసాడు. కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్లలోనే సౌత్ ఇండియాతో పాటు, బాలీవుడ్ సినిమాలకు యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేసి ఓ బ్రాండ్‌గా ఎదిగారు. స్టంట్ కొరియోగ్రాఫర్ కేటగిరీని తొలిసారి జాతీయ అవార్డుల్లో పొందుపరిచినప్పుడు, ఆ ఘనతను సొంతం చేసుకున్న యాక్షన్…

సాహో నాలుగు రోజుల కలెక్షన్స్
టాక్ తో సంబంధం లేకుండా దూసుకుపోతుంది సాహో సినిమా. సైలెంట్ పాయిజన్ లాగా ఎక్కుతూ.. కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతుంది. మొదటి రెండు రోజుల్లోనే రెండు వందల కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టిన సాహో నాలుగు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో ‘సాహో’ 67 కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. ఇక హిందీలో నాలుగో రోజు 14.20 కోట్ల గ్రాస్ ను కాలెక్ట్ చేసింది. మొత్తంగా హిందీ వర్షన్ నాలుగు రోజుల్లో రూ. 93.28 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. మరి వరుసగా సెలవలు కూడా రావడంతో సాహో కు కూడా కలిసొచ్చింది. మరి ఈ సినిమా నాగులు రోజుల్లో ఏయే ఏరియాలో ఎంత కాలేచ్ట్ చేసిందో చూద్దాం.

సాహో దర్శకుడు సుజీత్ పాత జ్ఞాపకాలు
350 కోట్ల బడ్జెట్ తో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ ఆగస్ట్ 30 వ తేదీ రిలీజయిన విషయం తెలిసిందే. టాక్ తో ప్రమేయం లేకుండా రికార్డ్ కలెక్షన్స్ రాబడుతుంది. సాహో మూవీ పై , దర్శకుడు సుజీత్ పై క్రిటిక్స్ విమర్శల వర్షం కురిపించారు. బ్లాక్ బస్టర్ బాహుబలి మూవీ తో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ప్రభాస్ వన్ మూవీ ఓల్డ్ దర్శకుడు సుజీత్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం విశేషం. ప్రభాస్ ను పర్ఫెక్ట్ గా దర్శకుడు హ్యాండిల్ చేయలేదని అభిమానులు కూడా అసంతృప్తి కి గురయ్యారు.
ఎయిర్ పోర్ట్ లో హీరోయిన్
హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ నిశ్శబ్దం మూవీ సియోటెల్ లో షూటింగ్ పార్ట్ కంప్లీట్ చేసుకుంది. మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైకేల్ మ్యాడ్సన్ ముఖ్య పాత్రలలో నటించారు. గోపిసుందర్ సంగీతం అందించారు. తెలుగులో నిశ్శబ్దం, ఇతర భాషలలో సైలెన్స్ గా రిలీజ్ కానున్న ఈ మూవీ పూర్తిగా US లో చిత్రీకరణ జరుపుకొనడం విశేషం.
సాహో , ఎవరు మూవీస్ పై KTR ప్రశంసలు
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరో గా సుజీత్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, హిందీ భాషలో భారీ బడ్జెట్ తో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ సాహో మూవీ భారీ అంచనాలతో ఆగస్ట్ 30వ తేదీ రిలీజయి మిశ్రమ స్పందన పొందింది. సాహో మూవీ టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్స్ లో రికార్డ్ క్రియేట్ చేస్తుంది. 3రోజులకు సుమారు 300 కోట్లు కలెక్ట్ చేసినట్టు సమాచారం. వెంకట్ రామ్ జీ దర్శకత్వంలో అడివి శేష్ హీరోగా రూపొందిన క్రైమ్ థ్రిల్లర్ ఎవరు మూవీ ఆగస్ట్ 15 వ తేదీ రిలీజయి ఘనవిజయం సాధించి దిగ్విజయంగా ప్రదర్శించబడుతుంది.

మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘బంగారు బుల్లోడు’కు 26 ఏళ్ళు
నటసింహ నందమూరి బాలకృష్ణ పంచె కట్టుతో వెండితెరపై దర్శనమిచ్చిన చిత్రాల్లో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. అంతేకాదు... అలా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో పలు చిత్రాలు మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్‌గానూ అలరించాయి. అటువంటి సినిమాల్లో ‘బంగారు బుల్లోడు’ ఒకటి. బాలకృష్ణ సరసన రమ్యకృష్ణ, రవీనా టాండన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో... రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, శ్రీవిద్య, శరత్ సక్సేనా, దేవన్, దేవరాజ్, అన్నపూర్ణ, బ్రహ్మానందం, బాబూమోహన్, మాస్టర్ బాలాదిత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని... జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై…

ఒక్క రోజు గ్యాప్‌లో రానున్న ‘ఈగ’ స్టార్స్
దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘ఈగ’ (2012)లో... కథానాయకుడిగా నేచురల్ స్టార్ నాని, ప్రతినాయకుడిగా కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ పోటీ పడి మరీ నటించిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే... ఆ సినిమాలో రైవల్స్‌గా నటించిన ఈ ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్... ఇప్పుడు ఒక రోజు గ్యాప్ లో తమ రాబోయే చిత్రాలతో సందడి చేయనున్నారు.

వరుస చిత్రాలతో పాయల్ రాజ్ పుత్ సందడి
‘ఆర్ ఎక్స్100’తో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమైంది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే మెమరబుల్ హిట్ అందుకున్న ఈ ఉత్తరాది సోయగం... ఆపై 'ఎన్టీఆర్ కథానాయకుడు' చిత్రంలో అతిథి పాత్రలోనూ, 'సీత' సినిమాలో ప్రత్యేక గీతంలోనూ మెరిసింది. కాగా... ఏడాదికిపైగా విరామం తరువాత పూర్తిస్థాయి కథానాయిక పాత్రల్లో వరుసగా మూడు చిత్రాలతో సందడి చేయనుంది పాయల్. అంతేకాదు... ఈ మూడు చిత్రాలు కూడా తక్కువ గ్యాప్‌లోనే రిలీజ్ కానుండడం విశేషం.

సీజన్‌కో సినిమాతో రానున్న ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్
తెలుగునాట విజయవంతమైన చిత్రాలకు చిరునామాగా నిలిచిన సంస్థల్లో ఏకే ఎంటర్టైన్మెంట్స్ ఒకటి. ఓ వైపు స్టార్ హీరోలతోనూ... మరోవైపు మీడియం హీరోలతోనూ వరుస చిత్రాలను నిర్మిస్తున్న ఈ సంస్థ... ప్రస్తుతం మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను నిర్మిస్తోంది. ఆ చిత్రాలే... 'సరిలేరు నీకెవ్వరు', 'బంగారు బుల్లోడు', 'చాణక్య'. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే... ఈ మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా... మూడు వేర్వేరు పండుగలకి విడుదల కానున్నాయి.

చిరంజీవి `స్వయంకృషి`కి 32 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి నటనావైభవానికి ప్రతీకగా నిలిచిన చిత్రాలలో `స్వయంకృషి` ఒకటి. ఇందులోని సాంబయ్య పాత్రలో చిరు నటించిన తీరు విమర్శకులను సైతం కట్టిపడేసింది. అంతేకాదు... చిరుకి జోడీగా నటించిన విజయశాంతిని నటశిఖరాగ్రాన నిలబెట్టిందీ చిత్రం. సుమలత, సర్వదమన్ బెనర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాలో... మాస్టర్ అర్జున్, చరణ్ రాజ్, జె.వి.సోమయాజులు, బ్రహ్మానందం, పి.ఎల్.నారాయణ తదితరులు ముఖ్య భూమికలు పోషించారు. “కళాతపస్వి” కె.విశ్వనాథ్ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని... పూర్ణోదయ మూవీ క్రియేషన్స్ పతాకంపై ఏడిద నాగేశ్వరరావు నిర్మించారు.

తనకు తానే పోటీగా పరిణమించిన ప్రభాస్ ప్రభంజనం
డివైడ్ టాక్ తో ప్రారంభమైనప్పటికీ దాన్ని తిప్పికొడుతూ అద్భుతమైన కలెక్షన్ల కనక వర్షంతో దూసుకుపోతున్న సాహో ప్రభంజనం ముందు గత రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఇండియన్ ఫిలిం ట్రేడ్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెగ్యులర్ ఫార్ములా కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన ఫార్మేట్ తో రూపొందిన సాహో చిత్రాన్ని రిసీవ్ చేసుకోవడంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ సినిమాలోని రియల్ స్త్రెంగ్థ్ ను గమనించిన తరువాత " సాహో" నిజమైన ప్రభంజనం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 10 వేల థియేటర్లలో ప్రతిష్టాత్మకంగా విడుదలైన 'సాహో' టాక్ విషయంలో తొలి రోజుకు ఇప్పటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అత్యంత వ్యయప్రయాసలతో హాలీవుడ్ ప్రమాణాలతో…

'సాహో' టాక్ కు కలెక్షన్స్ కు సంబంధం లేదు
ఆగస్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన 'సాహో ' చిత్రం టాక్ కు , వస్తున్న కలెక్షన్స్ కు సంబంధం లేదు. టాక్ ఎంత డివైడెడ్ గా ఉందో కలెక్షన్స్ అంత బలంగా ఉన్నాయి. ఒక కమర్షియల్ సినిమా సక్సెస్ కు కలెక్షన్స్ కొలమానం అయినప్పుడు ఈ రోజున 'సాహు' చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కలెక్షన్స్ ఆ చిత్ర ఘన విజయానికి అద్దం పడుతున్నాయి. మొన్న రివ్యూస్ లో విమర్శించిన జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, చానల్స్, వెబ్సైట్లు ఈ రోజున కలెక్షన్స్ చూసి "ఆఫ్టర్ బాహుబలి" అని అభినందించటం "సాహో " సాధిస్తున్న ఘన విజయానికి నిదర్శనం.

బాక్స్ ఆఫీస్ వద్ద సాహో కలెక్షన్ల ప్రభంజనం
సాహో లాంటి సినిమా రిలీజ్ అయితే ఎలా ఉంటుందో దాని కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తుంది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ బద్దలు కొడుతూ.. సాలిడ్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు రూ. 42 కోట్లకు పైగా షేర్ రాబట్టిన ‘సాహో రెండో రోజు కూడా అదే స్పీడ్ ను కొనసాగించింది. రెండో రోజు తెలుగు రాష్ట్రాల్లో రూ. 10 కోట్లకి పైగా షేర్ రాబట్టినట్టు తెలుస్తుంది. ఇక హిందీ వెర్షన్ విషయానికొస్తే.. తొలి రోజే 25 కోట్లు వసూలు చేసిన ఈ సినిమా రెండో రోజు రూ. 28 కోట్లకు పైగా కొల్లగొట్టింది. కర్ణాటక, కేరళ, తమిళనాడు మూడు స్టేట్స్ వరకు సాహో రూ. 10 కోట్ల గ్రాస్ రాబట్టింది. ఓవరాల్‌గా…

మరోసారి ఖాకీలో వెంకీ?
పోలీస్ కథలకి సరిపడ ఫిజిక్, స్టైలిష్ లుక్ విక్టరీ వెంకటేష్ సొంతం. ‘సూర్య ఐ.పి.ఎస్.’, ‘సూపర్ పోలీస్’, ‘ఘర్షణ’, ‘ఈనాడు’, ‘బాబు బంగారం’, ‘ప్రేమమ్’(అతిథిగా)... వంటి చిత్రాల్లో వెంకీ పోలీస్ పాత్రల్లో కనిపించి ప్రేక్షకులను అలరించారు. కట్ చేస్తే... స్వల్ప విరామం తర్వాత మరోసారి ఖాకీలో సందడి చేయనున్నారట వెంకీ.

నవంబర్ నుంచి చిరు, కొరటాల చిత్రం?
మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్ ఓరియెంటెడ్ సబ్జెక్ట్ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో... చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్. కాగా... తన చిత్రాల్లో హీరోలను చాలా స్టైలిష్‌గా, ట్రెండీ లుక్‌లో చూపించే కొరటాల... ఈ సినిమాలోనూ చిరుని అలానే చూపించే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. ఇందులో భాగంగా... ఇప్పటికే చిరు కోసం ముంబైకి చెందిన ఓ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్‌తో ఈ మేరకు చర్చలు కూడా జరుపుతున్నాడని భోగట్టా. కాగా... ఇప్పటికే స్లిమ్ గా, స్మార్ట్ అండ్ ఫిట్ లుక్‌లోకి మారిన చిరు ఫొటోస్ సోషల్ మీడియాలో సందడి…

కోలీవుడ్ పై కన్నేసిన బన్నీ..?
దాదాపు ఏడాదికి పైన గ్యాప్ తర్వాత అల్లుఅర్జున్ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా జరుపుకుంటుంది. వీటితో పాటు సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు.

మరో మిషన్ కు సిద్దమైన తాప్సీ
తెలుగుతో పాటు హిందీలో కూడా వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది తాప్సీ. ఇటీవలే మిషన్ మంగళ్ సినిమాతో హిందీలో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకుంది తాప్సీ. ప్రస్తుతం తను 'సాండ్ కీ ఆంఖ్' అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరప్రదేశ్‌లో షూటర్ దాదీస్‌గా పేరొందిన మహిళా షూటర్లు చంద్రో తోమర్, ప్రకాశీ తోమర్ అనే ఇద్దరు మహిళల జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కుతుంది. తుషార్ హీరానందని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్, అనురాగ్ కశ్యప్, నిధి పర్మార్ నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను జరుపుకుంటుంది.