పీట‌ర్ హెయిన్స్ ద‌ర్శ‌క‌త్వంలో న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ ( బుజ్జి) నిర్మాత‌గా సినిమా!

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Fight Master Peter Hein Turns Director, Peter Hein Turns Director, Peter Hein Latest Movie News, Stunt choreographer Peter Hein to turn director with Mohanlal film, Stunt choreographer Peter Hein

పీట‌ర్ హెయిన్స్… ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. గౌత‌మ్ మీన‌న్ `చెలి`తో ఫైట్ మాస్ట‌ర్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయ‌న కృష్ణ‌వంశీ ద‌ర్శ‌క‌త్వంలో `మురారి`తో తెలుగులో ఎంట్రీ ఇచ్చారు. ఆ త‌ర్వాత `అప‌రిచితుడు`, `శివాజీ`, `గ‌జిని`, `మ‌గ‌ధీర‌`, `రోబో`, `విల‌న్‌`, `విక్ర‌మ సింహ‌`, `బాహుబ‌లి`, `మ‌న్యం పులి`…ఇలా ఎన్నో సినిమాలకు ఆయన స్టంట్ మాస్టర్ గా పని చేసాడు. కెరీర్ ప్రారంభించిన కొన్నాళ్ల‌లోనే సౌత్ ఇండియాతో పాటు, బాలీవుడ్ సినిమాల‌కు యాక్ష‌న్ సీక్వెన్స్ ప్లాన్ చేసి ఓ బ్రాండ్‌గా ఎదిగారు. స్టంట్ కొరియోగ్రాఫ‌ర్ కేట‌గిరీని తొలిసారి జాతీయ అవార్డుల్లో పొందుప‌రిచిన‌ప్పుడు, ఆ ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్న యాక్ష‌న్ డైర‌క్ట‌ర్‌గా ఆయ‌న పేరు న‌మోదైంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఇదిలా ఉండగా ఇప్పుడు పీట‌ర్ హెయిన్స్ మెగా ఫోన్ పట్టుకున్నట్టు తెలుస్తుంది. గత కొద్దిరోజులుగా సినిమా తీయాలని ట్రై చేస్తున్న అయన ప్రయత్నం ఇప్ప‌టికి కార్య‌రూపం దాల్చింది. పీట‌ర్ హెయిన్స్ క‌ల‌ను సాకారం చేయ‌డానికి నిర్మాత న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి) ముందుకొచ్చారు. ల‌క్ష్మీ న‌ర‌సింహా ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై `ల‌క్ష్మీ`, `ల‌క్ష్యం`, `రేసు గుర్రం`, `ముకుంద‌`… ఇలా ఎన్నో విజ‌య‌వంత‌మైన సినిమాల‌ను తెర‌కెక్కించిన నిర్మాత న‌ల్ల‌మ‌లుపు బుజ్జి. తాజాగా త‌మ ల‌క్ష్మీ న‌ర‌సింహ ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ‌లో పీట‌ర్ హెయిన్స్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాను తెర‌కెక్కించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రాన్ని బేబి భ‌వ్య స‌మ‌ర్పిస్తున్నారు.

ఈ సందర్భంగా న‌ల్ల‌మ‌లుపు శ్రీనివాస్ (బుజ్జి) మాట్లాడుతూ “ పీట‌ర్ హెయిన్స్ చెప్పిన క‌థ విన‌గానే న‌చ్చింది. క‌థ టేకాఫ్ అయ్యే విధానం నుంచి ప్ర‌తిదీ ఎక్స్ ట్రార్డిన‌రీగా అనిపించింది. అందుకే వెంట‌నే ఓకే చెప్పేశాను. హీరో, హీరోయిన్ తో పాటు ఇత‌ర ఆర్టిస్టుల‌ను ఎంపిక చేయాలి. ఆ వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తాను. చిత్రాన్ని ద‌స‌రాకు పూజా కార్య‌క్ర‌మాల‌తో లాంఛ‌నంగా ప్రారంభిస్తాం. మా బ్యాన‌ర్‌లో మ‌రో మంచి సినిమా వ‌స్తుంద‌ని గ‌ర్వంగా చెప్ప‌గ‌ల‌ను“ అని అన్నారు. మరి స్టంట్ మాస్టర్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సినిమా ఎంత వరకు సక్సెస్ ఇస్తుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

19 − 11 =