
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 7


డార్లింగ్స్ ఇదంతా మీవల్లే..!
విలన్ గా మారిన కుమారి 21ఎఫ్ భామ..?

అక్టోబర్ లో రానున్న 'అక్షర'..!

మెగాస్టార్ కు జోడీగా ఇలియానా..?

ఒకే రోజు విడుదల కానున్న శ్రధ్ధా’స్ మూవీస్...

'రామ చక్కని సీత' ట్రైలర్ రిలీజ్

పోరాట ఘట్టాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’

‘ఆర్ ఆర్ ఆర్’ కోసం తారక్ సంచలన నిర్ణయం?

నాగ చైతన్య నటప్రస్థానానికి పదేళ్ళు

కథానాయకుడిగా నాని ప్రయాణానికి 11 ఏళ్ళు

ట్రెండింగ్ లో భరత్ అనే నేను మూవీ సీన్

బ్లాక్ బస్టర్ మూవీ ‘శభాష్ రాముడు’కు 60 ఏళ్ళు

2020 సంక్రాంతి కేరాఫ్ రీ-ఎంట్రీస్

బాలీవుడ్ లో 100 క్రోర్స్ క్లబ్ మూవీ

కంగనా 'తలైవి' ఇంట్రెస్టింగ్ అప్ డేట్
ఏ ఎల్ విజయ్ దర్శకత్వంలో దివంగత తమిళనాడు ముఖ్య మంత్రి జయలలిత బయోపిక్ 'తలైవి' రూపొందుతున్న సంగతి తెలిసిందే. జయలలిత రాజకీయాల్లోకి ఎలా ఎంట్రీ ఇచ్చారు.. రాజకీయంలో ఎదుర్కొన్న వివాదాలు అన్నీ ఈ బయోపిక్ లో చూపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది.

బిగ్ బాస్ హౌస్ లో రవికృష్ణ కు అన్యాయం జరిగిందా..!
బిగ్ బాస్ సీజన్ 3 లో.. ఉన్నా అందరి కంటెస్టెంట్లలో కాస్త ఓపిక ఎక్కువ, ఎలాంటి గొడవలకు పోకుండా, నెమ్మదిగా తన గేమ్ ను ఆడుకుంటున్న వ్యక్తి ఎవరంటే వెంటనే రవికృష్ణ అని చెప్పేయొచ్చు. మొదటి నుండి తన ఆటను తన స్టైల్ ల్లో ఆడుతూ మంచి కంటెస్టెంట్ గా ఆడియన్స్ మనసులో చోటు దక్కించుకున్నాడు. మరి అలాంటి రవికి నిన్న జరిగిన టాస్క్ లో అన్యాయం జరిగిందా అంటే జరిగిందనే అంటున్నారు ప్రేక్షకులు.

కార్తికేయ కొత్త సినిమా ఫస్ట్ లుక్, టైటిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
మొదటి సినిమా 'ఆర్ ఎక్స్ 100' తో మంచి హిట్ కొట్టిన కార్తికేయ హిప్పితో కాస్త వెనుకపడి గుణ 369 తో మరోసారి ఫామ్ లోకి వచ్చాడు. ఇక ఇప్పుడు వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. నాని విలన్ గా నటించి గ్యాంగ్ లీడర్ సినిమా ఈ నెల 13వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

డార్లింగ్స్ ఇదంతా మీవల్లే..!
మొత్తానికి సాహో రిలీజ్ తో ఆ సినిమా హడావుడి కాస్త తగ్గింది. అయితే బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ హడావుడి మాత్రం తగ్గలేదు. సాహో మానియా కు భయపడి ఆ దరిదాపుల్లో ఎలాంటి రిలీజ్ లను పెట్టుకోలేదు. ఇక మంచి టైం లో రిలీజ్ చేసుకోవడంతో ఐదు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.350 (గ్రాస్) కోట్ల వసూళ్లు రాబట్టింది. ఇక ఒక వారం వరకు పెద్ద సినిమాలు కూడా ఏం లేకపోవడంతో ఇది కూడా సాహో కు కలిసొచ్చే అంశమే. సెప్టెంబర్ 13న గ్యాంగ్ లీడర్, సెప్టెంబర్ 20న వాల్మీకి సినిమాలు తప్పా చెప్పుకోతగ్గ సినిమాలు లేవు.. సో ఆ లోపు సాహో కు అడ్డంకి లేదు.

నిశ్శబ్దం మూవీ అనుష్క ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్
స్టార్ హీరోయిన్ అనుష్క, మాధవన్, అంజలి, షాలిని పాండే, శ్రీనివాస్ అవసరాల, సుబ్బరాజు, మైఖేల్ మ్యాడ్సన్ ప్రధాన పాత్రలలో, హేమంత్ మధుకర్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీ నిశ్శబ్ధం రూపొందుతుంది. పూర్తిగా US లో షూటింగ్ జరుపుకున్న నిశ్శబ్ధం మూవీ తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో రిలీజ్ కానుంది. తెలుగు లో నిశ్శబ్ధం టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజవుతుందని సమాచారం.
విలన్ గా మారిన కుమారి 21ఎఫ్ భామ..?
'కుమారి 21ఎఫ్' సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన హెబ్బాపటేల్ మొదటి సినిమాతోనే యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఇక ఆ సినిమా తర్వాత వరుస సినిమాల్లో నటించినా ఒకటి రెండు సినిమాలు తప్ప పెద్దగా ఆడిన సినిమాలు ఏమి లేవు. ప్రస్తుతం అమ్మడి చేతిలో ఏం సినిమాలు లేక సరైన అవకాశం కోసం ఎదురుచూస్తుంది. ఈ నేపథ్యంలో తాజాగా ఇప్పుడు హెబ్బా కు మరో బంపర్ ఆఫర్ దక్కినట్టు తెలుస్తుంది.

అక్టోబర్ లో రానున్న 'అక్షర'..!
ఇప్పటికే పలు హార్రర్ సినిమాలతో భయపెట్టిన సినిమా నందిత శ్వేతా మరోసారి భయపెట్టడానికి రెడీ అవుతోంది. బి.చిన్నికృష్ణ దర్శకత్వంలో నందిత శ్వేత ప్రధాన పాత్రలో ‘అక్షర’ అనే థ్రిల్లర్ మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమా టీజర్ ను ఇటీవలే రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఈ సినిమాను అక్టోబర్ లో రిలీజ్ లో చేయాలని పాలన్ చేస్తున్నారు దర్శక నిర్మాతలు. త్వరలోనే అధికారిక ప్రకటన ఇవ్వనున్నారు.

మెగాస్టార్ కు జోడీగా ఇలియానా..?
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం స్వతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా సినిమా పనుల్లో బిజీ గా వున్నాడు. షూటింగ్ ను పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుండగా.. మరో వైపు ప్రమోషన్ కార్యక్రమాలు షురూ చేశారు. ఇక ఈ సినిమాను ఆక్టోబర్ 8 వ తేదీన రిలీజ్ చేయనున్నారు.

ఒకే రోజు విడుదల కానున్న శ్రధ్ధా’స్ మూవీస్...
పేరులోనే కాదు... అందం, అభినయంలోనూ వారికి వారే సాటి. అంతేకాదు... కెరీర్‌లోనూ మంచి విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న ఈ ఇద్దరు భామలలో... ఒకరు బాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంటే... మరొకరు సౌత్ ఇండియన్ ఆడియన్స్‌ను అలరిస్తున్నారు. వారే... బాలీవుడ్ మోస్ట్ టాలెంటెడ్ యాక్ట్రస్ శ్రధ్ధా కపూర్, సౌత్ ఇండియన్ టాలెంటెడ్ హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్. కాగా... ఇప్పుడు ఈ ఇద్దరు టాలెంటెడ్ బ్యూటీస్ ఒకే రోజున తమ తమ అప్‌కమింగ్ మూవీస్‌తో ఆడియన్స్‌ను అలరించడానికి సిధ్ధపడుతున్నారు.

'రామ చక్కని సీత' ట్రైలర్ రిలీజ్
ఇంద్ర, సుకృత జంటగా శ్రీ హర్ష మందా దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘రామ చక్కని సీత’. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇప్పటికే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసారు చిత్రయూనిట్.

పోరాట ఘట్టాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’
‘సరిలేరు నీకెవ్వరు’.... సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రం. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో మహేష్‌కి జోడీగా రష్మిక మందన్న నటిస్తుండగా... లేడీ సూపర్‌స్టార్ విజయశాంతి ఓ శక్తిమంతమైన పాత్రలో దర్శనమివ్వనున్నారు.

‘ఆర్ ఆర్ ఆర్’ కోసం తారక్ సంచలన నిర్ణయం?
`బాహుబలి` సిరీస్ తరువాత దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్ఠాత్మక చిత్రం `ఆర్ ఆర్ ఆర్`. యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కథానాయకులుగా తెరకెక్కుతున్న ఈ పేట్రియాటిక్ డ్రామా... తెలుగుతో పాటు పలు భారతీయ భాషల్లో ఒకే రోజున విడుదల కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్‌చల్ చేస్తోంది.

నాగ చైతన్య నటప్రస్థానానికి పదేళ్ళు
ఒకవైపు రొమాంటిక్, యాక్షన్ మూవీస్‌తో యువతను ఆకట్టుకుంటూనే... మరోవైపు ఫ్యామిలీ ఓరియెంటెడ్ సబ్జెక్ట్స్‌తో కుటుంబ ప్రేక్షకులను కూడా అలరిస్తున్నాడు యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య. ‘ఏమాయ చేసావె’, `ప్రేమమ్` లాంటి లవ్ స్టోరీస్ తోనూ.. ‘తడాఖా’ లాంటి యాక్షన్ మూవీస్ తోనూ... ‘100% లవ్’ లాంటి రొమాంటిక్ ఎంటర్‌టైనర్స్ తోనూ.. ‘మజిలీ’, `రారండోయ్ వేడుక చూద్దాం` లాంటి కుటుంబ కథా చిత్రాలతోనూ... `మనం`లాంటి వైవిధ్యభరితమైన చిత్రాలతోనూ... అన్ని వర్గాల ప్రేక్షకులకు చేరువైన వైనం ఈ అక్కినేని వారి మూడో తరం కథానాయకుడి సొంతం.

కథానాయకుడిగా నాని ప్రయాణానికి 11 ఏళ్ళు
`పక్కింటి అబ్బాయి` పాత్రలకు చిరునామాగా నిలచిన ఈ తరం కథానాయకుడు నాని. కేవలం ఆ తరహా భూమికలకే పరిమితం కాకుండా వైవిధ్యభరితమైన చిత్రాల్లోనూ భాగమవుతూ తన సహజ నటనతో నేచురల్ స్టార్ అనిపించుకున్నాడు ఈ టాలెంటెడ్ యంగ్ హీరో. అంతేకాదు... హ్యాట్రిక్ విజయాలే కనుమరుగైపోతున్న ఈ రోజుల్లో... డబుల్ హ్యాట్రిక్ విజయాలు సాధించి ఈ తరం కథానాయకుల్లో ఓ అరుదైన ఘనతను కూడా సొంతం చేసుకున్నాడు నాని. ఇక ఇటీవల విడుదలైన ‘జెర్సీ’తో నటుడిగా మరో మెట్టు ఎక్కి విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు.

ట్రెండింగ్ లో భరత్ అనే నేను మూవీ సీన్
ట్రాఫిక్ నిబంధనలు అతిక్రమించిన ప్రయాణీకులు ప్రమాదాల బారిన పడకుండా భారత దేశ ప్రభుత్వం భారీ జరిమానాలు విధించిన విషయం తెలిసిందే. హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, వెహికల్ గుర్తింపు పేపర్స్, అతి వేగం, ఓవర్ లోడ్ వంటి ట్రాఫిక్ నిబంధనలు పాటించనివారికి భారీ జరిమానాలు విధించమని రాష్ట్ర ప్రభుత్వాలను, కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది.

బ్లాక్ బస్టర్ మూవీ ‘శభాష్ రాముడు’కు 60 ఏళ్ళు
మహానటుడు నందమూరి తారక రామారావు, లెజెండరీ డైరెక్టర్ సి.ఎస్.రావు కాంబినేషన్‌లో పలు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసాయి. వాటిలో ‘శభాష్ రాముడు’ ఒకటి. ఎన్టీఆర్, దేవిక నాయకానాయికలుగా నటించిన ఈ సినిమాలో... రమణమూర్తి, రేలంగి, కాంతారావు, గుమ్మడి వెంకటేశ్వరరావు, ఆర్.నాగేశ్వరరావు, గిరిజ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. వెంపటి సదాశివబ్రహ్మం కథను అందించగా... రాజశ్రీ ప్రొడక్షన్స్ పతాకంపై సుందర్‌లాల్ నహతా, టి.అశ్వద్ధనారాయణ సంయుక్తంగా నిర్మించారు. హిందీ చిత్రం ‘బడా భాయి’(1957)కి రీమేక్‌గా ‘శభాష్ రాముడు’ను రూపొందించారు దర్శకుడు సి.ఎస్.రావు.

సెప్టెంబర్ లో పాత టైటిల్స్‌తో కొత్త సినిమాల సందడి
పాత సినిమాల పేర్లతో కొత్త సినిమాలు తెరకెక్కడం అనాదిగా ఉన్న వ్యవహారమే. అయితే... ఒకే నెలలో వరుసగా మూడు వారాల పాటు ఇటువంటి టైటిల్స్‌తో సినిమాలు విడుదల కావడం అంటే... కచ్చితంగా వార్తల్లో నిలచే అంశమే. అలా... 2019 సెప్టెంబర్ టాలీవుడ్ కి ప్రత్యేకం కానుంది.

2020 సంక్రాంతి కేరాఫ్ రీ-ఎంట్రీస్
2020 సంక్రాంతికి పలు ఆసక్తికరమైన చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. అయితే... వాటిలో రెండు క్రేజీ ప్రాజెక్ట్స్ మాత్రం ఎంతో ప్రత్యేకం కానున్నాయి. ఎందుకంటే... ఇద్దరు స్టార్ హీరోలు నటిస్తున్న ఆ యా సినిమాలతో నిన్నటి తరం అగ్ర కథానాయికలిద్దరు భారీ విరామం తరువాత తెలుగు తెరపై దర్శనమివ్వనున్నారు. వారిలో ఒకరు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాగా... మరొకరు టాలెంటెడ్ యాక్ట్రస్ టబు.

బాలీవుడ్ లో 100 క్రోర్స్ క్లబ్ మూవీ
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెలుగు, తమిళ, హిందీ భాషలలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ సాహో కలెక్షన్స్ రికార్డ్స్ పరంపర కొనసాగుతోంది. ప్రపంచ వ్యాప్తం గా 5రోజులలో 350 కోట్లు గ్రాస్ కలెక్షన్స్ సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. ఇండియా లో సాహో మూవీ హిందీ వెర్షన్ 5రోజులకు 102 కోట్లు కలెక్ట్ చేసి 100 కోట్ల క్లబ్ లో చేరింది. సాహో మూవీ లోని యాక్షన్ సీన్స్, అందమైన లొకేషన్స్ కు అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు.
సెప్టెంబర్ 2019... దక్షిణాది అనువాద చిత్రాల సందడి
2019 సెప్టెంబర్‌లో... వరుసగా మూడు వారాల పాటు దక్షిణాది అనువాద చిత్రాలు థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధపడుతున్నాయి.