దాదాపు ఏడాదికి పైన గ్యాప్ తర్వాత అల్లుఅర్జున్ వరుస సినిమాలతో బిజీ అయిపోయాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అల వైకుంఠపురంలో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా శరవేగంగా జరుపుకుంటుంది. వీటితో పాటు సుకుమార్ తో ఒక సినిమా చేస్తున్నాడు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా అల్లు అర్జున్ కోలీవుడ్ పై కూడా కన్నేసినట్టు తెలుస్తుంది. తమిళ్ లో ఒక మంచి హిట్ కొట్టాలని బన్నీ చూస్తున్నాడట. ఈ నేపథ్యంలోనే ఓ మంచి కథ కోసం చూస్తున్నట్టు తెలుస్తుంది. నిజానికి ఆ మధ్యనే బన్నీ ప్రముఖ తమిళ దర్శకుడు లింగు స్వామితో సినిమా చేద్దామని పిక్స్ అయ్యాడు. చాలా కాలం చర్చలు సైతం జరిగాయి. అయితే అది కుదరలేదు. దాంతో తెలుగులో వరస ప్రాజెక్టులలో బిజీ అయ్యాడు.
దాంతో ఇఫ్పుడు మరోసారి తమిళ దర్శకుడు మురగదాస్ తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. రీసెంట్ గా మురగదాస్ వచ్చి అల్లు అర్జున్ కు స్టోరీ లైన్ చెప్పినట్లు తెలుస్తోంది. తమిళ, తెలుగు భాషలకు వర్కవుట్ అయ్యే యాక్షన్ స్టోరీ లైన్ అని వెంటనే ఓకే చేసి పూర్తి స్క్రిప్టు రెడీ చేయమని చెప్పినట్లు సమాచారం. మరి దీనిపై క్లారిటీ రావాలంటే కొద్దీ రోజులు వెయిట్ చేయాల్సిందే.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























