ఒక్క రోజు గ్యాప్‌లో రానున్న ‘ఈగ’ స్టార్స్

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Nani Gang Leader And Sudeep Pahilwan to Release in a Day Gap, Nani Gang Leader Latest Movie News, Sudeep Latest Movie News, Nani Gang Leader And Sudeep Pahilwan Movie Release Dates,

దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి తెరకెక్కించిన ఫాంటసీ యాక్షన్ ఫిల్మ్ ‘ఈగ’ (2012)లో… కథానాయకుడిగా నేచురల్ స్టార్ నాని, ప్రతినాయకుడిగా కన్నడ స్టార్ ‘కిచ్చా’ సుదీప్ పోటీ పడి మరీ నటించిన సంగతి తెలిసిందే. కట్ చేస్తే… ఆ సినిమాలో రైవల్స్‌గా నటించిన ఈ ఇద్దరు టాలెంటెడ్ యాక్టర్స్… ఇప్పుడు ఒక రోజు గ్యాప్ లో తమ రాబోయే చిత్రాలతో సందడి చేయనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఆ వివ‌రాల్లోకి వెళితే… సుదీప్ హీరోగా ఎస్.కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన కన్నడ చిత్రం ‘పెల్వాన్’. సెప్టెంబర్ 12న విడుదల కానున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్… తెలుగునాట ‘పహిల్వాన్’ పేరుతో అదే రోజున అనువాద రూపంలో విడుదల కానుంది. ఇక ఆ సినిమా రిలీజ్ అయిన తదుపరి రోజు అంటే… సెప్టెంబర్ 13న నాని హీరోగా రూపొందిన ‘గ్యాంగ్ లీడర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది.

‘ఈగ’లో క‌ల‌సి న‌టించి విజ‌యాన్ని అందుకున్న నాని, సుదీప్… ఇప్పుడు ఒక్క రోజు గ్యాప్ లో రానున్న ఈ అప్ కమింగ్ మూవీస్ తోనూ ఆ మ్యాజిక్ ని కొనసాగించాలని ఆశిద్దాం.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + 17 =