‘సాహో’ టాక్ కు కలెక్షన్స్ కు సంబంధం లేదు

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Prabhas Saaho Latest Movie News, Saaho Movie Collections, Saaho Movie Latest Collection , Saaho Movie Area Wise Collections, Saaho Box Office Rampage Continues, Saaho Box Office Collections

ఆగస్టు 30 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘సాహో ‘ చిత్రం టాక్ కు , వస్తున్న కలెక్షన్స్ కు సంబంధం లేదు. టాక్ ఎంత డివైడెడ్ గా ఉందో కలెక్షన్స్ అంత బలంగా ఉన్నాయి. ఒక కమర్షియల్ సినిమా సక్సెస్ కు కలెక్షన్స్ కొలమానం అయినప్పుడు ఈ రోజున ‘సాహు’ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా వస్తున్న కలెక్షన్స్ ఆ చిత్ర ఘన విజయానికి అద్దం పడుతున్నాయి. మొన్న రివ్యూస్ లో విమర్శించిన జాతీయ, అంతర్జాతీయ పత్రికలు, చానల్స్, వెబ్సైట్లు ఈ రోజున కలెక్షన్స్ చూసి “ఆఫ్టర్ బాహుబలి” అని అభినందించటం “సాహో ” సాధిస్తున్న ఘన విజయానికి నిదర్శనం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అయితే రెగ్యులర్ ఫార్మేట్ కు కొంచెం భిన్నంగా, అవేగా ఉండటంతో తొలిరోజు కొంత డివైడెడ్ టాక్ వచ్చిన మాట వాస్తవమే. అయితే దానిని ఆసరాగా తీసుకుని సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకొని సాహో మీద దుష్ప్రచారం చేయడం దురదృష్టకరం. అత్యంత భారీ స్థాయిలో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మించిన యాక్షన్ థ్రిల్లర్ ‘సాహా’ ను దేశంలోని అన్ని ప్రాంతాల వారు, అన్ని భాషల వాళ్లు ఆదరిస్తుంటే తెలుగులో కొంతమంది కావాలని నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేస్తున్నట్లుగా సమాచారం. ఒక తెలుగు సినిమా ప్యాన్ ఇండియా సినిమాగా అంతర్జాతీయ స్థాయిలో 10 వేలకు పైగా థియేటర్లలో విడుదలై సంచలనాత్మకంగా కలెక్షన్ రాబడుతుంటే తెలుగు వారిగా గర్వపడాల్సినది పోయి సినిమా మీద దుష్ప్రచారం చేయడం ఏ మాత్రం సమంజసం కాదు.

తొలి రోజున ఉభయ రాష్ట్రాల్లో 36.52 కోట్లు , ప్రపంచవ్యాప్తంగా 73.06 కోట్లు షేర్ వసూలు చేసి రికార్డు సృష్టించిన చిత్రం సాహో. రెండో రోజున కూడా హైయెస్ట్ షేర్ రాబట్టిన ‘నాన్ బాహుబలి’ సినిమాగా రికార్డు సృష్టించింది. నైజాంలో రెండో రోజున 4.82 కోట్ల షేర్ సాధించి బాహుబలి-2 రికార్డును క్రాస్ చేసింది. ఉభయ రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం లేకపోతే కలెక్షన్ల పరంగా సాహో ఇంకా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసి ఉండేది. కాబట్టి ఒక తెలుగు స్టార్, ఒక తెలుగు నిర్మాణ సంస్థ అంతర్జాతీయ స్థాయిలో సాధిస్తున్న ఈ విజయాన్ని చూసి అందరూ గర్వపడాలి. మొదటి రోజు తన రివ్యూ లో సాహో ను ఘాటుగా విమర్శించిన జాతీయ స్థాయి పాపులర్ రివ్యూ రైటర్ తరుణ్ ఆదర్శ్ రెండో రోజు కలెక్షన్లు చూసి ‘ అవుట్ స్టాండింగ్’ అని అభినందించడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా కేవలం రెండు రోజుల్లో 205 కోట్ల గ్రాస్ వసూలు చేసిన ‘సాహో’ ఓవరాల్ ల్యాండింగ్ కలెక్షన్స్ లో సరికొత్త రికార్డులు నెలకొల్పుతుంది అన్నది ట్రేడ్ వర్గాల అంచనా. మొత్తం మీద టాక్ తో నిమిత్తం లేని రెవెన్యూ తో దూసుకుపోతున్న ‘సాహో’ చివరకు
ఏ రేంజ్ హిట్ గా నిలుస్తుందో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eighteen + 3 =