నవంబర్ నుంచి చిరు, కొరటాల చిత్రం?

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Chiranjeevi Koratala Siva Shoot from November, Chiranjeevi Koratala film to kick-start in November, Chiranjeevi Koratala Latest Movie News, Chiranjeevi Koratala Next To Start Shoot From November, Koratala Next To Begain Shoot From November

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. మెసేజ్‌ ఓరియెంటెడ్ సబ్జెక్ట్‌ తో తెరకెక్కనున్న ఈ చిత్రంలో… చిరు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నారని టాక్. కాగా… తన చిత్రాల్లో హీరోలను చాలా స్టైలిష్‌గా, ట్రెండీ లుక్‌లో చూపించే కొరటాల… ఈ సినిమాలోనూ చిరుని అలానే చూపించే ప్రయత్నం చేస్తున్నాడని సమాచారం. ఇందులో భాగంగా… ఇప్పటికే చిరు కోసం ముంబైకి చెందిన ఓ ప్రముఖ కాస్ట్యూమ్ డిజైన‌ర్‌తో ఈ మేరకు చర్చలు కూడా జరుపుతున్నాడని భోగ‌ట్టా. కాగా… ఇప్పటికే స్లిమ్ గా, స్మార్ట్ అండ్ ఫిట్ లుక్‌లోకి మారిన చిరు ఫొటోస్ సోషల్ మీడియాలో సందడి చేస్తున్న సంగతి తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కొణిదెల ప్రొడక్షన్స్, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంయుక్తంగా నిర్మించబోతున్న ఈ చిత్రం… నవంబర్ నుంచి పట్టాలెక్కనుందని వినికిడి. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడికానున్నాయి.

ఇదిలా ఉంటే… చిరు తాజా చిత్రం ‘సైరా నరసింహారెడ్డి’ అక్టోబర్ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

1 × 2 =