మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్ ‘బంగారు బుల్లోడు’కు 26 ఏళ్ళు

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Balakrishna Bangaru Bullodu Completes 26 Year, 26 Years For Bangaru Bullodu, Balakrishna Bangaru Bullodu Movie, Bangaru Bullodu Telugu Movie, 26 Years Completed For Bangaru Bullodu, Balakrishna Latest Movie News

నటసింహ నందమూరి బాలకృష్ణ పంచె కట్టుతో వెండితెరపై దర్శనమిచ్చిన చిత్రాల్లో సింహభాగం విజయం సాధించినవే కావడం విశేషం. అంతేకాదు… అలా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల్లో పలు చిత్రాలు మ్యూజిక‌ల్ బ్లాక్ బ‌స్ట‌ర్స్‌గానూ అలరించాయి. అటువంటి సినిమాల్లో ‘బంగారు బుల్లోడు’ ఒకటి. బాలకృష్ణ సరసన రమ్యకృష్ణ, రవీనా టాండన్ కథానాయికలుగా నటించిన ఈ చిత్రంలో… రావుగోపాలరావు, అల్లు రామలింగయ్య, శ్రీవిద్య, శరత్ సక్సేనా, దేవన్, దేవరాజ్, అన్నపూర్ణ, బ్రహ్మానందం, బాబూమోహన్, మాస్టర్ బాలాదిత్య తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని… జగపతి ఆర్ట్ పిక్చర్స్ పతాకంపై వి.బి.రాజేంద్రప్రసాద్ నిర్మించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వేటూరి సుందరరామమూర్తి, భువనచంద్ర గీత రచయితలుగా… రాజ్-కోటి స్వరపరచిన పాటలన్నీ బ్లాక్ బ‌స్ట‌ర్స్‌గా నిలచాయి. వాటిలో “స్వాతిలో ముత్యమంత”, “ఎన్నెట్లో చాపేసి”, “మనసు ఆగదు”, “గుడివాడ గుమ్మరో”, “తథిగినతోం” వంటి పాటలు విశేషాదరణ పొందాయి. 1993 సెప్టెంబర్ 3న విడుదలై విజయకేతనం ఎగురవేసిన ‘బంగారు బుల్లోడు’… నేటితో 26 వసంతాలను పూర్తి చేసుకుంటోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.