
ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 9


"సాహో "రే - బాలీవుడ్

ఇండియా నెం1 సినీ హీరోయిన్ ?

ముంబై లో దర్బార్ మూవీ ఆఖరి షెడ్యూల్
బన్నీ, సుక్కు... ముహూర్తం ఫిక్స్!?

శ్రీముఖిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?
దిగ్గజాలనే నడిపించిన సుజీత్ కు 'సాహో'
అజిత్ కు విలన్ గా అజయ్ దేవగన్..?

నాగార్జున విషయంలో ఎంత తప్పు చేశారు నాగేశ్వరరావు గారూ..!
శర్వా, రీతూ జంటగా కొత్త చిత్రం ప్రారంభం

అల .. వైకుంఠపురములో .. మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ డేట్
గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, పూజ హెగ్డే జంటగా అల .. వైకుంఠపురములో .. మూవీ శరవేగంగా రూపుదిద్దుకొంటున్న విషయం తెలిసిందే. టబు, జయరామ్, నివేత పెత్తురాజ్, సుశాంత్, నవదీప్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. థమన్ S సంగీతం అందించారు.

"సాహో "రే - బాలీవుడ్
2019 సంవత్సరం లో రిలీజయిన హిందీ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్ లో టాప్ 5 మూవీస్ నెట్ కలెక్షన్స్ తెలుసుకుందాం.

రికార్డ్ స్థాయిలో సాహో కలెక్షన్స్
సుజీత్ దర్శకత్వం లో భారీ తారాగణం తో తెరకెక్కిన సాహో నిన్న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా మంచి టాక్ తో దూసుకుపోతుంది. ఇక కలెక్షన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక్కరోజే ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా 100 కోట్లు కలెక్ట్ చేసింది. ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా 40 కోట్లకు పైగా కలెక్ట్ చేసినట్టు సినీ విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. మరి ఈ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం

ఇండియా నెం1 సినీ హీరోయిన్ ?
2003 సంవత్సరంలో మనస్సినక్కరే మూవీ తో మల్లువుడ్ కు పరిచయమైన నయనతార కోలీవుడ్ లో అయ్యా మూవీ, టాలీవుడ్ లో లక్ష్మీ మూవీ తో ఎంటరయ్యారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల స్టార్ హీరోలతో నటించిన నయనతార ఉమెన్ సెంట్రిక్ మూవీస్ లో నటించి లేడీ సూపర్ స్టార్ గా ఎదిగి ఆయా భాషలలో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతున్న నయనతార నటించిన చంద్రముఖి, గజని, లక్ష్మీ, సింహా , శ్రీరామ రాజ్యం, తమిళ మూవీస్ బిళ్ళ, రాజారాణి, ఇరు ముగన్, కోలమవు కోకిల, ఇమైక్క నొడిగళ్ ఘనవిజయం సాధించాయి.

అప్పుడు 'బాహుబలి' కి ఇప్పుడు 'సాహో' కి సీన్ రిపీట్
మొత్తానికి అందరూ ఎంతగానో ఎదురు చూసిన సాహో సినిమా నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఓ తెలుగు సినిమా గురించి దేశం మొత్తం మాట్లాడటం 'బాహుబలి'తో మొదలైతే, `సాహో` దాన్ని కొనసాగించింది. ఎన్నో అంచనాలతో రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ టాక్ తో దూసుకుపోతుంది. ఇక సినిమా చూసిన తర్వాత డైరెక్టర్ ను సాహో సుజీత్ అని చెప్పకుండా ఉండలేము. హై యాక్షన్ ఎంటర్ టైనర్ గా సాగే ఈ సినిమా, ట్విస్ట్ లు అండ్ యాక్షన్ లాంటి అంశాలు ఆకట్టుకున్నాయి. ఈ సినిమా కోసం వాడిన ట్రక్కులు... కార్లు.. గన్ లు అన్నీ సుజిత్ దగ్గరుండి చేయించాడు. ఆ కష్టానికి తగిన ఫలితం ఈ సినిమాలో కాపాడుతుంది.

ముంబై లో దర్బార్ మూవీ ఆఖరి షెడ్యూల్
లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ , నయనతార జంటగా AR మురుగదాస్ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్ థ్రిల్లర్ దర్బార్ తమిళ మూవీ 2020 సంక్రాంతికి రిలీజ్ కానుంది. బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి ప్రతినాయకుడిగా నటిస్తున్న ఈ మూవీ లో నివేత థామస్, ప్రతీక్ బబ్బర్, యోగి బాబు ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు.

నవంబర్ నుంచి బాలయ్య, బోయపాటి సినిమా?
నటసింహ నందమూరి బాలకృష్ణకు కలిసొచ్చిన దర్శకుల్లో యాక్షన్ మూవీస్ స్పెషలిస్ట్ బోయపాటి శ్రీను ఒకరు. గతంలో ఈ ఇద్దరి కలయికలో ‘సింహా’, ‘లెజెండ్’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. అయితే... గత కొంత కాలంగా ఈ కాంబినేషన్‌లో మరో సినిమా రాబోతోందని వార్తలు వినిపిస్తూ వచ్చాయి. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు సమాచారం.

‘వాల్మీకి’లో శ్రీదేవి పాట రీమిక్స్?
‘దేవత’(1982) సినిమాలోని... “ఎల్లువొచ్చి గోదారమ్మ ఎల్లాకిల్లా పడ్డాదమ్మో”... అనే పాట ఎంతగా ప్రజాదరణ పొందిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వేటూరి సుందరరామమూర్తి రచనకి చక్రవర్తి స్వరకల్పన తోడై వీనుల విందుగా నిలచిపోయిన ఈ గీతాన్ని... తనదైన మార్కు పిక్చరైజేషన్‌తో కనువిందుగా తెరకెక్కించారు దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు. శోభన్‌బాబు, శ్రీదేవిపై చిత్రీకరించిన ఈ ఎవర్‌గ్రీన్ సాంగ్‌ను... ఇప్పుడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న ‘వాల్మీకి’ చిత్రం కోసం రీమిక్స్ చేయనున్నారని సమాచారం.
బన్నీ, సుక్కు... ముహూర్తం ఫిక్స్!?
‘నా పేరు సూర్య’ తరువాత దాదాపు ఏడాది గ్యాప్ తీసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్... ఇప్పుడు వరుసగా మూడు క్రేజీ ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టిన సంగతి తెలిసిందే. వాటిలో ఒకటి ఏస్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘అల వైకుంఠపురములో’ కాగా... రెండోది వేణు శ్రీరామ్ తెరకెక్కించనున్న ‘ఐకాన్’. మూడోది సుకుమార్ కాంబినేషన్ మూవీ.

శ్రీముఖిని కావాలనే టార్గెట్ చేస్తున్నారా?
బిగ్ బాస్ 3 రియాలిటీ షో గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎన్ని వివాదాలు ఎదురైనా కూడా ఈ షో మాత్రం సక్సెస్ ఫుల్ గా నడుస్తూనే ఉంది. ఇక ఈ షో లో వన్ ఆఫ్ డ్ కంటెస్టెంట్ అయిన శ్రీముఖి గురించి కూడా ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లితెర యాంకర్ గా మంచి పేరు సంపాదించుకున్న శ్రీముఖి అప్పుడప్పుడు వెండి తెరపై కూడా మెరుస్తూనే ఉంది. ప్రస్తుతం తన అల్లరితో.. తన యాక్టీవ్ నెస్ తో బిగ్ బాస్ హౌస్ లో సందడి చేస్తుంది.
కెరీర్ బెస్ట్ హిట్స్ తరువాత వస్తున్న టాలీవుడ్ స్టార్స్
గత చిత్రాలతో కెరీర్ బెస్ట్ హిట్స్ అందుకున్న కొందరు స్టార్ హీరోలు... 2019 చివరి నాలుగు నెలల్లో భారీ అంచనాల మధ్య తమ నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌తో సందడి చేస్తున్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

45 ఏళ్ళ కెరీర్‌ని పూర్తిచేసుకున్న నందమూరి బాలకృష్ణ
క్లాస్, మాస్ అనే తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తున్న అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ. సాంఘికం, జానపదం, చారిత్రకం, పౌరాణికం... ఇలా జానర్ ఏదైనా తన నటనాకౌశలంతో ప్రేక్షకులను మెప్పించారు, మెప్పిస్తున్నారు. అలాంటి బాలకృష్ణ నటప్రస్థానానికి బీజం వేసిన చిత్రం ‘తాతమ్మ కల’. తన తండ్రి, మహానటుడు యన్.టి.రామారావు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో బాల నటుడిగా (14 ఏళ్ళు) దర్శనమిచ్చారు బాలయ్య. తొలి చిత్రంతోనే అభినయానికి పుష్కలంగా అవకాశమున్న పాత్రలో నటించి ప్రశంసలు పొందారు.

బాబాయ్ హీరోయిన్‌తో అబ్బాయ్ ఆటాపాటా
నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం `ఎంత మంచివాడవురా`. మెహరీన్ కథానాయికగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌కి `శతమానం భవతి` ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ సినిమా... 2020 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
బాలీవుడ్‌లో సందడి చేసిన మూడు తరాల టాలీవుడ్ అగ్ర కథానాయకులు
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం ‘సాహో’. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ రూపొందిన ఈ ట్రైలింగ్వల్ యాక్షన్ ఎంటర్‌టైనర్... ఈ రోజు (ఆగస్టు 30) ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అంతేకాదు... ఈ సినిమాతో ప్రభాస్ నేరుగా బాలీవుడ్‌లోనూ అడుగుపెడుతుండడం విశేషం. అలాగే... తన పాత్రకు తనే డబ్బింగ్ చెప్పుకున్నారు కూడా. ఆసక్తికరమైన అంశమేమిటంటే... ప్రభాస్ కంటే ముందు టాలీవుడ్‌కి చెందిన పలువురు అగ్ర కథానాయకులు హిందీనాట తమదైన ముద్ర వేశారు. మూడు తరాలకు చెందిన ఆ అగ్ర కథానాయకుల వివరాల్లోకి వెళితే...
రూ. వందల కోట్ల చిత్రాలకు చిరునామాగా నిలుస్తున్న ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్
“చేసే పనిలో శ్రేష్టత, నిబద్ధత, క్రమశిక్షణ ఉంటే విజయం దానంతట అదే వరిస్తుంది” అనే మాటకు చిరునామాగా నిలుస్తారు ఎడిటర్ అక్కినేని శ్రీకర్ ప్రసాద్. పలు జాతీయ, ప్రాంతీయ పురస్కారాలను అందుకున్న శ్రీకర్ ప్రసాద్... తెలుగు చిత్రం ‘సింహస్వప్నం’(1989)తో తొలి అడుగులు వేశారు. ఆపై పలు తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, ఆంగ్ల చిత్రాలకు పనిచేశారు. అనేక బ్లాక్‌బస్టర్ మూవీస్‌లో భాగమైన శ్రీకర్ ప్రసాద్... ప్రస్తుతం పలు భారీ బడ్జెట్ మూవీస్‌తో బిజీగా ఉన్నారు. ఆసక్తికరమైన విషయమేమిటంటే... వీటిలో సింహభాగం రూ.వందల కోట్లతో రూపొందుతున్న సినిమాలే ఉన్నాయి.
దిగ్గజాలనే నడిపించిన సుజీత్ కు 'సాహో'
నిండా ముప్పై ఏళ్ళు లేవు.. తీసింది కేవలం ఒక్క సినిమా.. ఒక్క సినిమా తో బాహుబలిని డైరెక్ట్ చేసే అవకాశం దక్కించుకున్నాడు. అంటే ప్రభాస్ ను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది మనం చెప్పడం చాలా ఈజీగా చెప్పొచ్చు కానీ.. దానికి సుజీత్ పడిన కష్టం ఏంటో అతనికే తెలుస్తుంది. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా.. తనకు సినిమాల పట్ల ఉన్న అంకిత భావమే సుజిత్ ను ఇప్పుడు ఈ స్థాయిలో కూర్చోబెట్టింది అని చెప్పొచ్చు. మొదట.. యూట్యూబ్ ఛానెల్‌పెట్టి.. షార్ట్ ఫిలిమ్స్ తీసి ఆ తర్వాత యువీ క్రియేషన్స్ పై 'రన్ రాజా రన్' సినిమాను తీసి మొదటి సినిమాతో హిట్ కొట్టి శర్వాకి లైఫ్ నిచ్చింది. ఊహించని లాభాలు తెచ్చింది. సుజిత్‌పై కాలుక్యులేషన్స్…
అజిత్ కు విలన్ గా అజయ్ దేవగన్..?
బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ 'బద్లా' ను తమిళ్ లో 'నేర్కొండ పార్వాయ్' పేరుతో రీమేక్ చేసి ఇక్కడ కూడా హిట్ కొట్టాడు తమిళ్ తాలా అజిత్. హెచ్ వినోద్ డైరెక్టర్ గా, బోనీ కపూర్, అజిత్ కాంబినేషన్ లో ఈ నెల 18వ తేదీన రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబడుతుంది. ఇక ఇప్పుడు ఇదే కాంబినేషన్ లో మరో సినిమా కూడా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జారుకుంటున్నట్టు తెలుస్తుంది. సెప్టెంబర్ లో ఈ సినిమా ను సెట్స్ పైకి తీసుకెళ్లే యోచనలో ఉన్నారట.
'మీకు మాత్రమే చెప్తా' ఫస్ట్ లుక్ రిలీజ్
తొలి సినిమా పెళ్లి చూపులు సినిమాతో యువ దర్శకుడు తరుణ్ భాస్కర్ కు మంచి గుర్తింపు వచ్చింది. విజయ్ దేవరకొండ నిర్మాతగా.. 'ది కింగ్ ఆఫ్ హిల్స్' ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ హీరో గా ఓ సినిమా తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక నిన్ననే ఈ సినిమా టైటిల్ ను రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ ఈరోజు తాజాగా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. ఒక స్మార్ట్ ఫోన్ డిస్ ప్లే లుక్ లో సెట్ చేసిన పోస్టర్ సరికొత్తగా ఉంది. ఇక మై బెస్ట్ ఫ్రెండ్స్ సీక్రెట్స్ అనే ట్యాగ్ తో తరుణ్ భాస్కర్ అలాగే మరోప్ ఇద్దరు కమెడియన్స్ మొబైల్స్ తో ఆశ్చర్యంగా ఇచ్చిన స్టిల్స్ చూస్తుంటే సినిమాలో కామెడీ డోస్ గట్టిగానే ఉంటుందని ఊహించవచ్చు.

నాగార్జున విషయంలో ఎంత తప్పు చేశారు నాగేశ్వరరావు గారూ..!
పరుగులు పెట్టటం కాలం నైజం. రోజులు, గంటలు, నిమిషాలు, క్షణాలుగా కరిగిపోయే కాలప్రవాహంలో మధుర క్షణాలుగా, మధురానుభూతులుగా నిలిచి పోయే సందర్భాలు, సంఘటనలు ఎవరి జీవితంలో ఎక్కువగా ఉంటాయో అవే వారి ఆనంద, ఆరోగ్య రహస్యాలు.
శర్వా, రీతూ జంటగా కొత్త చిత్రం ప్రారంభం
14 రీల్స్ ప్లస్ బ్యానర్ పై నూతన దర్శకుడు కిషోర్ రెడ్డి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా రైతు సమస్యల నేపథ్యం లో ఎమోషనల్ డ్రామా శ్రీకారం మూవీ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. దానితో పాటు 96 తమిళ సూపర్ హిట్ మూవీ రీమేక్ కూడా చేస్తున్నాడు. 96 సినిమా అయిపోయిన తర్వాత శ్రీకారం సినిమా చేయనున్నాడు.