వాల్మీకి లో సర్ ప్రయిజ్ ఇవ్వనున్న స్టార్ డైరెక్టర్ సుకుమార్..?

2019 Latest Telugu Film News, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News, Harish Shankar Reveals Sukumar Surprise in Valmiki, Top Director Surprise in Valmiki, Director Sukumar May Act In Valmiki Movie, Creative Director Guest Role In Valmiki, Harish Shankar Reveals Surprise in Valmiki, Valmiki Surprise

హరీష్ శంకర్ దర్శకత్యంలో వాల్మీకి సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. అయితే ఈ సినిమాను మొదట సెప్టెంబర్ 6న రిలీజ్ చేద్దామనుకున్నారు… కానీ సాహో మేనియా వల్ల సెప్టెంబర్ 20 వ తేదీన రిలీజ్ చేయాలనీ ఫిక్స్ అయ్యారు దర్శకనిర్మాతలు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉండగా ఇప్పుడు మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది. సుకుమార్ నుండి వాల్మీకిలో ఒక చిన్న సప్రైజ్ అంటూ డైరెక్టర్ హరీష్ శంకర్ ట్వీట్ చేశారు. దీనితో అప్పుడే గెస్సింగ్ లు మొదలయ్యాయి. సుకుమార్ సినిమాలో కనిపిస్తారని కొందరంటే లేదు వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తారని ఇంకొందరు అంటున్నారు. మరి ఇందులో క్లారిటీ రావాలంటే కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

కాగా పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో త‌మిళ న‌టుడు అధ‌ర్వ మురళి కీలక పాత్రను పోషిస్తున్నాడు. 14రీల్స్ ప్లస్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు మిక్కీ జే మేయర్‌ బాణీలు సంగీతం అందిస్తున్నారు. మరి మొదటిసారి వరుణ్ నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించనున్నాడు. మరి ఈ సినిమా ఎంతవరకు సక్సెస్ అందుతుందో చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen + 5 =