తనకు తానే పోటీగా పరిణమించిన ప్రభాస్ ప్రభంజనం

2019 Latest Telugu Film News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News, Baahubali Prabhas Vs Saaho Prabhas, Prabhas Saaho Latest Movie News, Saaho Movie Collections, Saaho Movie Latest Collection , Saaho Movie Area Wise Collections, Baahubali collections Vs Saaho Collections

డివైడ్ టాక్ తో ప్రారంభమైనప్పటికీ దాన్ని తిప్పికొడుతూ అద్భుతమైన కలెక్షన్ల కనక వర్షంతో దూసుకుపోతున్న సాహో ప్రభంజనం ముందు గత రికార్డులు తుడిచిపెట్టుకుపోవడం ఇండియన్ ఫిలిం ట్రేడ్ ను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. రెగ్యులర్ ఫార్ములా కమర్షియల్ చిత్రాలకు భిన్నమైన ఫార్మేట్ తో రూపొందిన సాహో చిత్రాన్ని రిసీవ్ చేసుకోవడంలో కొంత ఆలస్యం జరిగినప్పటికీ సినిమాలోని రియల్ స్త్రెంగ్థ్ ను గమనించిన తరువాత ” సాహో” నిజమైన ప్రభంజనం ప్రారంభమైంది. ప్రపంచవ్యాప్తంగా 10 వేల థియేటర్లలో ప్రతిష్టాత్మకంగా విడుదలైన ‘సాహో’ టాక్ విషయంలో తొలి రోజుకు ఇప్పటికి పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అత్యంత వ్యయప్రయాసలతో హాలీవుడ్ ప్రమాణాలతో రూపొందిన సాహో చిత్రంలోని టెక్నికల్ ఎక్సలెన్సీ రిపీట్ ఆడియన్స్ ను థియేటర్ కు రప్పిస్తుంది. ఒక ఇండియన్ రీజినల్ ఫిలిం పాన్ ఇండియా ఫిలింగా పాపులారిటీ సాధించి ఇంటర్నేషనల్ ప్లాట్ ఫామ్ మీద most prestigious ఫిలింగా రిలీజ్ కావటం ప్రతి తెలుగు వాడు గర్వించదగిన విశేషం.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గతంలో 2015, 2017 సంవత్సరాలలో విడుదలై ప్రపంచ సినిమా చరిత్రలో ఒక అనితరసాధ్యమైన అద్భుతంగా నిలిచిపోయిన బాహుబలి సిరీస్ తర్వాత ఆ ప్రభంజనాన్ని, ఆ కలెక్షన్లను దరిజేరగల ఇండియన్ ఫిలిం మరొకటి రాలేదు. ఇప్పుడు మరలా తన ఉదృతికి, రికార్డులకు తానే పోటీ అన్నట్లు ‘సాహో తో తనతో తానే పోటీపడుతోంది ప్రభాస్ పాపులారిటీ.2015లో బాహుబలి ద బిగినింగ్ వీకెండ్ నెట్ కలెక్షన్స్ 22.35 కోట్లు కాగా , 2017 లో బాహుబలి ద కంక్లూషన్ వీకెండ్ నెట్ కలెక్షన్స్ 128 కోట్లు కాగా ఇప్పుడు 2019 లో సాహో మూడు రోజుల నెట్ కలెక్షన్ దాదాపు 80 కోట్లు దాటటంతో ఈ కలెక్షన్ల ట్రెండ్ ప్రభాస్ వర్సెస్ ప్రభాస్ గా పరిణమించింది.ముఖ్యంగా నార్త్ ఇండియాలో తొలిరోజు తొలి షో నుండే అద్భుతమైన పాజిటివ్ టాక్ తో ప్రారంభం కాగా తెలుగులో మాత్రమే కొంత డివైడెడ్ టాక్ వచ్చింది. కానీ కలెక్షన్లు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా రావటంతో నెగిటివ్ రివ్యూ ఇచ్చిన మీడియా ఆ ప్రభంజనాన్ని చూసి ఆశ్చర్యపోతుంది. ప్రపంచవ్యాప్తంగా రెండు రోజుల్లో 205 కోట్ల కలెక్షన్లు రాబట్టిన ‘ సాహో’ ఏరియా వైజ్ గా, థియేటర్ల వైజ్ గా, ఫస్ట్ డే, సెకండ్ డే కలెక్షన్ల వైజ్ గా అనేక సరికొత్త రికార్డులను సెట్ చేసింది. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రెండు రోజుల్లో 29 లక్షల 99 000, 722 రూపాయల గ్రాస్ తో అంతకుముందు బాహుబలి 2 చేసిన 29 లక్షల 18000, 206 రూపాయల గ్రాస్ రికార్డును బీట్ అవుట్ చేసింది సాహో. ఈ విధంగా సాహో తో అనేకచోట్ల తనకు తానే పోటీగా సరికొత్త రికార్డులు సృష్టిస్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.