ట్యాగ్ · 2073 కథనాలు · పేజీ 28
ఎస్. వీ. సి.20 ఏళ్ల గ్రేట్ జర్నీ మీట్

'కురుక్షేత్ర' ట్రైలర్ రిలీజ్

20 వసంతాల శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్

నటుడు బెనర్జీకి 'జంధ్యాల మెమోరియల్ అవార్డ్'

డేటింగ్ లో ఉన్నా - అమలాపాల్

కథనం రిలీజ్ డేట్ ఫిక్స్

సైరా ఓ విజువల్ ఫీస్ట్

హీరో రామ్ చరణ్ గాయపడిన వార్త అవాస్తవం
ఆకట్టుకుంటున్న ఆది సాయికుమార్ జోడీ టీజర్

డ్యాన్స్ బేస్డ్ ఫిల్మ్‌లో యన్టీఆర్?

AA 19 మూవీ లో టబు ట్రెడిషినల్ లుక్

హీరోయిన్ సంగీత టాలీవుడ్ లో రీఎంట్రీ

పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’కు 21 ఏళ్ళు

చిరు ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’కు 17 ఏళ్ళు

గ్యాంగ్ లీడర్ టీజర్ రిలీజ్

మారిన వాల్మీకి రిలీజ్ డేట్

విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన కొత్త ట్రెండ్
అంతర్జాతీయంగా 'బాహుబలి'కి మరో ఘనత
బాహుబలి సినిమా గురించి అది సాధించిన రికార్డులు, కలెక్షన్ల గురించి సినిమా లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమ ఘనతకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చిన సినిమా ఇది. జక్కన్న అనే పేరును సార్థకం చేసుకుంటూ.. రాజమౌళి చెక్కిన బాహుబలి అనే శిల్పం దేశవ్యాప్తంగా మన్ననలు పొందింది. ఇప్పటికే ఈ సినిమాకు అనేక రకాలుగా గౌరవం దక్కగా తాజాగా మరొక గౌరవం దక్కింది. అదేమిటంటే సినిమా మొదటి భాగం 'బాహుబలి - ది బిగినింగ్' ను రాయల్ ఆల్బర్ట్ హాల్ నందు ప్రదర్శించనున్నారు.
ఎస్. వీ. సి.20 ఏళ్ల గ్రేట్ జర్నీ మీట్
సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన అనే మూడు విభాగాల సమాహారం. సినీ ప్రముఖులలో చాలామంది ఈ మూడింటిలో ఏదో ఒక రంగంలో రాణిస్తారు తప్ప మూడింటిలోనూ సమ స్థాయి విజయాలను సాధించినవారు చాలా అరుదు. అలా మూడు విభాగాలలో విభ్రాంతికరమైన విజయాలను సొంతం చేసుకుంటూ 20 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు దిల్ రాజు.

'కురుక్షేత్ర' ట్రైలర్ రిలీజ్
మహాభారతంలోని కురుక్షేత్ర యుద్దం గురించి అందరికీ తెలిసిందే. ఆ హిస్టారికల్ వార్ నేపథ్యంలో కన్నడలో కురుక్షేత్ర అనే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కబోతున్న సంగతి కూడా విదితమే. పోస్ట్ ప్రోడక్షన్ పనులు సైతం ముగించుకున్న ఈసినిమా ఆగష్ట్ 9వ తేదీన రిలీజ్ కానుంది. ఒక్క కన్నడలోనే కాదు.. తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో కూడా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

20 వసంతాల శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్
దిల్ రాజు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 1999 సంవత్సరంలో ప్రారంభమైంది. ఒకే ఒక్కడు, నువ్వు వస్తావని, సఖి మూవీస్ తెలంగాణ రాష్ట్రం లోని నైజాం లో పంపిణీ చేశారు. ఆ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 4సంవత్సరాల తరువాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ మూవీ ని నిర్మించారు. దిల్ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది.

నటుడు బెనర్జీకి 'జంధ్యాల మెమోరియల్ అవార్డ్'
తెలుగు సినీపరిశ్రమలో మూడు దశాబ్ధాల పయన సుదీర్ఘ అనుభవం ఉన్న నటుడు బెనర్జీ. అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ప్రారంభించి అటుపై నటుడు అయ్యారు. విలన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. సినీ పరిశ్రమకు ఆయన ఎనలేని సేవలు చేశారు. అలాంటి బెనర్జీ కి ఇప్పుడు అరుదైన గౌరవం దక్కింది. బెనర్జీ చేసిన సేవల్ని గుర్తించి ఆయనకు జంధ్యాల మెమోరియల్ పురస్కారాన్ని అందించనున్నారని తెలుస్తోంది. ఈనెల 28న విజయవాడలో సుమధుర కళానికేతన్స్ బెనర్జీకి ఈ పురస్కారాన్ని అందించనున్నారు. విజయవాడ పీబీ సిద్ధార్థ ఆర్ట్స్ అండ్ సైన్స్ ఆడిటోరియంలో ఈ కార్యక్రమం జరగనుంది.

డేటింగ్ లో ఉన్నా - అమలాపాల్
కోలీవుడ్ లో మైనా తమిళ మూవీ తో విజయం సాధించిన అమలాపాల్ , బెజవాడ మూవీతో టాలీవుడ్ లో అడుగు పెట్టారు. అమలా పాల్ నటించిన లవ్ ఫెయిల్యూర్, నాయక్, ఇద్దరమ్మాయిలతో మూవీస్ ఘనవిజయం సాధించాయి. సినీ కెరీర్ పీక్ పొజిషన్ లో ఉన్నపుడే డైరక్టర్ AL విజయ్ ను వివాహం చేసుకున్నారు. తరువాత వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు. అమలా పాల్ ప్రస్తుతం తమిళ, మలయాళ భాషల చిత్రాలతో బిజీగా ఉన్నారు. రీసెంట్ గా రిలీజయిన ఆడై (ఆమె ) మూవీ లో నగ్నం గా నటించి సంచలనం సృష్టించారు.

కథనం రిలీజ్ డేట్ ఫిక్స్
ఒకపక్క యాంకర్ గా చేస్తూనే మరోపక్క వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా కెరీర్ లో దూసుకుపోతుంది అనసూయ. క్షణం సినిమాతో సీరియస్ నటిగా గుర్తింపు తెచ్చుకొని... ఆ తర్వాత రంగస్థలం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు రంగమ్మత్తగా గుర్తుండిపోయింది. అటు మంచి పాత్రలు ఎంచుకుంటూ మంచి నటిగా గుర్తింపుతెచ్చుకొని ఇప్పుడు ప్రధాన పాత్రలు చేసే స్థాయికి చేరుకుంది. ఇక ఇప్పుడు కథనం సినిమాతో మరోసారి తన సత్తా చూపించడానికి వచ్చేస్తుంది.

సైరా ఓ విజువల్ ఫీస్ట్
సురేందర్ రెడ్డి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో స్వతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా సైరా సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసుకొని... పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. చారిత్రక నేపథ్యం ఉన్న చిత్రం కావడంతో విజువల్ వండర్‌గా తీర్చిదిద్దేందుకు ఎక్కువ సమయం పడుతుంది.

హీరో రామ్ చరణ్ గాయపడిన వార్త అవాస్తవం
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా దర్శక ధీర రాజమౌళి దర్శకత్వంలో భారీ బడ్జెట్, భారీ తారాగణంతో RRR మూవీ రూపొందుతున్న విషయం తెలిసిందే. RRR మూవీ ప్రస్తుతం హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకొంటుంది. నగర శివారు లో ప్రత్యేకంగా రూపొందించిన బ్రిడ్జ్ సెట్ లో పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.
ఆకట్టుకుంటున్న ఆది సాయికుమార్ జోడీ టీజర్
జయాపజయాలతో పనిలేకుండా వరుస సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు ఆది సాయికుమార్. ఇప్పటికే ఆపరేషన్ గోల్డ్ ఫిష్, బుర్రకథ చిత్రాలు విడదలకాగా అవి బాక్సాఫీస్ వద్ద నిరాశనే మిగిల్చాయి. ఇప్పుడు ఆది హీరోగా ‘జెర్సీ’ ఫేమ్ శ్రధ్ధా శ్రీనాథ్ హీరోయిన్ గా ‘జోడి’ అనే టైటిల్ తో ఓ మూవీ రాబోతుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ ను పూర్తి చేసుకున్న జోడీ త్వరలో విడుదలకు సిద్దంగా ఉంది. ఇప్పటికే ఈసినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది.

`సరిలేరు నీకెవ్వరు`తో మరో టాలెంటెడ్ యాక్ట్రస్ రీ-ఎంట్రీ?
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం `సరిలేరు నీకెవ్వరు`. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి రూపొందిస్తున్న ఈ సినిమా ఇటీవలే తొలి షెడ్యూల్ పూర్తిచేసుకుంది. రెండో షెడ్యూల్ ఈ నెల 26 నుంచి ప్రారంభం కానుంది. ఇదిలా ఉంటే... ఈ సినిమాతో లేడీ సూపర్ స్టార్ విజయశాంతి రీ-ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ఓ పవర్ఫుల్ రోల్లో రాములమ్మ దర్శనమివ్వనున్నారు. ఆమెతో పాటు మరో టాలెంటెడ్ యాక్ట్రస్ కూడా ఈ సినిమాతో రీ-ఎంట్రీ ఇస్తున్నట్లు సమాచారం. ఆ నటి మరెవరో కాదు... సంగీత. `ఖడ్గం`, `పెళ్ళాం ఊరెళితే`, `శివపుత్రుడు`, `ధనం` చిత్రాలలో తన నటనతో అలరించిన సంగీత…

డ్యాన్స్ బేస్డ్ ఫిల్మ్‌లో యన్టీఆర్?
ఈ తరం కథానాయకుల్లో ఆల్ రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు యంగ్ టైగర్ యన్టీఆర్. నటనలోనే కాదు నర్తనంలోనూ తనదైన శైలితో అలరిస్తూ ముందుకు సాగుతున్నాడు తారక్. తొలి చిత్రం నుంచి నృత్యాల్లో తనదైన ముద్ర వేస్తున్నప్పటికీ... ఇప్పటివరకు ఈ నందమూరి హీరో కంప్లీట్ డ్యాన్స్ బేస్డ్ ఫిల్మ్ చేయనేలేదు. అయితే... ఆ లోటు త్వరలోనే తీరనుందని సమాచారం.

AA 19 మూవీ లో టబు ట్రెడిషినల్ లుక్
గీతా ఆర్ట్స్, హారిక &హాసిని క్రియేషన్స్ బ్యానర్స్ పై స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో AA 19 మూవీ శరవేగం గా రూపుదిద్దుకొంటుంది. పూజ హెగ్డే, నివేత పేతురాజ్ కథానాయికలు కాగా నవదీప్, సుశాంత్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. సీనియర్ హీరోయిన్ టబు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. AA 19 మూవీ లో టబు పాల్గొంటున్న సందర్భంగా ఘన స్వాగతం పలుకుతూ చిత్ర యూనిట్ ట్వీట్ చేశారు. ట్రెడిషినల్ లుక్ లో టబు అందంగా ఉన్నారు.

భారీగా పలికిన `మన్మథుడు 2` హిందీ డబ్బింగ్ రైట్స్?
కింగ్ నాగార్జున కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం `మన్మథుడు 2`. 2002లో విడుదలైన `మన్మథుడు`కి మరో వెర్షన్‌గా తెరకెక్కిన ఈ సినిమాకి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. నాగ్‌కి జోడీగా రకుల్ ప్రీత్ సింగ్ నటించగా... సమంత, కీర్తి సురేష్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. చిత్రీకరణ పూర్తిచేసుకున్న ఈ సినిమా... ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. ఇదిలా ఉంటే... ఈ చిత్రానికి సంబంధించిన హిందీ డబ్బింగ్ రైట్స్ భారీ మొత్తానికి అమ్ముడయ్యాయని టాలీవుడ్ టాక్.

హీరోయిన్ సంగీత టాలీవుడ్ లో రీఎంట్రీ
తమిళ, మలయాళ మూవీస్ హీరోయిన్ సంగీత ఆశల సందడి మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. బ్లాక్ బస్టర్ ఖడ్గం మూవీ తో గుర్తింపు పొందారు. ఖడ్గం మూవీ లో పెర్ ఫార్మెన్స్ కు బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా సంగీత ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకొన్నారు. పెళ్ళాం ఊరెళితే, శివపుత్రుడు వంటి మూవీస్ లో బెస్ట్ పెర్ ఫార్మెన్స్ ఇచ్చారు. 9సంవత్సరాల తరువాత సరిలేరు నీకెవ్వరు మూవీ తో టాలీవుడ్ లో సంగీత రీ ఎంట్రీ ఇస్తున్నారు.

పవన్ కళ్యాణ్ ‘తొలిప్రేమ’కు 21 ఏళ్ళు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్లో టర్నింగ్ పాయింట్లా నిలచిన చిత్రం `తొలిప్రేమ`. ఫీల్‌గుడ్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమా ద్వారా ప్రముఖ దర్శకుడు ఎ.కరుణాకరన్ డైరెక్టర్‌గా తొలి అడుగులు వేశాడు. పవన్‌కి జోడీగా కీర్తి రెడ్డి నటించిన ఈ చిత్రంలో... వాసుకి, సంగీత, నర్రా వెంకటేశ్వరరావు, నగేష్, అచ్యుత్, అలీ, వేణుమాధవ్, పీజే శర్మ, రవిబాబు తదితరులు ఇతర ముఖ్య భూమికలను పోషించారు. ‘సిరివెన్నెల’ సీతారామశాస్త్రి, భువనచంద్ర గీత రచన చేసిన పాటలకు... దేవా అద్భుతమైన స్వరాలు సమకూర్చారు.

చిరు ఇండస్ట్రీ హిట్ ‘ఇంద్ర’కు 17 ఏళ్ళు
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో పలు ఇండస్ట్రీ హిట్స్ ఉన్నాయి. వాటిలో ‘ఇంద్ర’ ఒకటి. భారీ బడ్జెట్ మూవీస్‌కి కేరాఫ్ అడ్రస్‌గా నిలచిన ప్రముఖ నిర్మాత సి.అశ్వనీదత్... తమ సంస్థ వైజయంతీ మూవీస్ సిల్వర్ జూబ్లీ ఇయర్స్‌ను పూర్తిచేసుకున్న సందర్భంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’, ‘చూడాలని వుంది!’ వంటి బ్లాక్ బస్టర్ మూవీస్ తరువాత చిరు, అశ్వనీదత్ కాంబినేషన్లో వచ్చిన ఈ సినిమా కూడా ఘనవిజయం సాధించింది. ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ చిత్రానికి బి.గోపాల్ దర్శకత్వం వహించాడు. బి.గోపాల్ పుట్టినరోజు కానుకగా విడుదలైన `ఇంద్ర... అతని కెరీర్లో మెమరబుల్…

గ్యాంగ్ లీడర్ టీజర్ రిలీజ్
మనం, హలో ఫేమ్ విక్రమ్ కె. కుమార్ దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని హీరోగా గ్యాంగ్ లీడర్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ తుది దశకు చేరుకుంది. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ సినిమా నుండి ప్రీ లుక్, ఫస్ట్ లుక్ రిలీజ్ చేయగా తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్.

మారిన వాల్మీకి రిలీజ్ డేట్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రధాన పాత్రలో హరీష్ శంకర్ రూపొందిస్తున్న చిత్రం ‘వాల్మీకి’. తమిళంలో ఘన విజయం సాధించిన ‘జిగర్తండా’కు రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో తమిళ నటుడు అధర్వ మురళి కీలక పాత్రను పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటుంది.

విజయ్ దేవరకొండ క్రియేట్ చేసిన కొత్త ట్రెండ్
సక్సెస్ ఫుల్ హీరో విజయ్ దేవరకొండ తాను నటించిన మూవీస్ ను తన సొంత స్టైల్ లో ప్రమోట్ చేస్తూ, మార్కెట్ వేల్యూ పెంచుతున్నారు. డియర్ కామ్రేడ్ మూవీ తో విజయ్ దేవరకొండ ఒక కొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. మ్యూజిక్ ఫెస్టివల్ పేరు తో చిత్ర యూనిట్ తో నాలుగు నగరాలలో ఈవెంట్స్ ను నిర్వహించి కొత్తపద్ధతి లో డియర్ కామ్రేడ్ మూవీ ని ప్రమోట్ చేశారు.