అంతర్జాతీయంగా ‘బాహుబలి’కి మరో ఘనత

2019 Latest Telugu Movie News, Baahubali Creates Another Record, One More Record For Baahubali, Another Record for Baahubali, SS Rajamouli film creates yet another record, Yet Another Record for Baahubali, Baahubali sets Another Major record, Baahubali Movie Latest News, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Baahubali Creates Another Record

బాహుబలి సినిమా గురించి అది సాధించిన రికార్డులు, కలెక్షన్ల గురించి సినిమా లవర్స్ కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు సినీ పరిశ్రమ ఘనతకు దేశవ్యాప్తంగా పేరు తెచ్చిన సినిమా ఇది. జక్కన్న అనే పేరును సార్థకం చేసుకుంటూ.. రాజమౌళి చెక్కిన బాహుబలి అనే శిల్పం దేశవ్యాప్తంగా మన్ననలు పొందింది. ఇప్పటికే ఈ సినిమాకు అనేక రకాలుగా గౌరవం దక్కగా తాజాగా మరొక గౌరవం దక్కింది. అదేమిటంటే సినిమా మొదటి భాగం ‘బాహుబలి – ది బిగినింగ్’ ను రాయల్ ఆల్బర్ట్ హాల్ నందు ప్రదర్శించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ కార్యక్రమానికి దర్శకుడు రాజమౌళి తో పాటు, ప్రభాస్, అనుష్క, రానా దగ్గుబాటి తో పాటు, సంగీత దర్శకుడు ఎం ఎం కీరవాణి పాల్గొననున్నారు. మూవీ ప్రదర్శన అనంతరం రాజమౌళి, కీరవాణితో ప్రశ్నోత్తరాల కార్యక్రమం కూడా ఉంటుందని తెలిపారు. పాల్గొంటారు.కాగా 1871లో క్వీన్ విక్టోరియా ప్రారంభించిన ఈ హాల్ లో ఒకేసారి 5544 మంది చూడొచ్చు. కొన్ని దశాబ్దాలుగా బ్రిటన్ సంప్రదాయాలకు సంబందించిన సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అలాంటి హాల్ లో మన తెలుగు సినిమాకు ఇలాంటి గుర్తింపు రావడం నిజంగా గర్వించతగ్గ విషయమే.

[subscribe]

[youtube_video videoid=FMwGC9-TIhQ]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.