దిల్ రాజు ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ డిస్ట్రిబ్యూషన్ సంస్థ 1999 సంవత్సరంలో ప్రారంభమైంది. ఒకే ఒక్కడు, నువ్వు వస్తావని, సఖి మూవీస్ తెలంగాణ రాష్ట్రం లోని నైజాం లో పంపిణీ చేశారు. ఆ మూవీస్ ఘనవిజయం సాధించాయి. 4సంవత్సరాల తరువాత దిల్ రాజు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పేరుతో నిర్మాణ సంస్థ ప్రారంభించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ మూవీ ని నిర్మించారు. దిల్ మూవీ రికార్డ్ కలెక్షన్స్ తో బ్లాక్ బస్టర్ మూవీ గా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దిల్ మూవీ తరువాత నిర్మించిన ఆర్య, భద్ర, బొమ్మరిల్లు మూవీస్ సూపర్ డూపర్ హిట్ అయ్యాయి, శ్రీ వెంకటేశ్వర ఫిల్మ్స్ పంపిణీ చేసిన నువ్వు నాకు నచ్చావ్, మురారి, ఖుషి, ఆది, అతడు, ఛత్రపతి, పోకిరి మూవీస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. బొమ్మరిల్లు మూవీ తరువాత దిల్ రాజు నిర్మించిన పరుగు, కొత్త బంగారు లోకం, బృందావనం, Mr పర్ ఫెక్ట్, SVSC, ఎవడు, సుప్రీమ్, శతమానం భవతి, నేను లోకల్, DJ, ఫిదా, రాజా ది గ్రేట్ ఘనవిజయం సాధించాయి.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందిన 30 చిత్రాలలో 22 చిత్రాలు హిట్స్,సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ గా నిలిచాయి. 4 మూవీస్ ఏవరేజ్, 4 మూవీస్ ప్రేక్షకాదరణ పొందలేదు. 2019 సంవత్సరంలో F 2 మూవీ ద్వారా దిల్ రాజు విజయకేతనం ఎగురవేశారు.శ్రీ వెంకటేశ్వర్ క్రియేషన్స్ బ్యానర్ పై రూపొందుతున్న 3 మూవీస్ షూటింగ్ జరుపుకుంటున్నాయి. 4మూవీస్ ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్నాయి. గీతా ఆర్ట్స్ బ్యానర్ తో కలసి నిర్మించిన పిల్లా నువ్వు లేని జీవితం మూవీ , వైజయంతీ మూవీస్, పివిపి సినిమా బ్యానర్స్ తో కలసి నిర్మించిన మహర్షి మూవీ విజయం సాధించాయి. GMB ఎంటర్ టైన్ మెంట్స్, AK ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ తో కలసి మహేష్ బాబు హీరోగా సరిలేరు నీకెవ్వరు మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నారు.
[youtube_video videoid=3d-H1sYBHkQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: