కథనం రిలీజ్ డేట్ ఫిక్స్

2019 Latest Telugu Movie News, Anasuya Bharadwaj Kathanam Movie Release Date Locked, Kathanam Movie Gets a Release Date, Kathanam Movie Latest Updates, Kathanam Movie Release Date Announced, Kathanam Movie Release Date Confirmed, Kathanam Movie Release Date Fixed, Kathanam Movie Release Date Revealed, Kathanam Release Date Locked, Telugu Film Updates, Telugu Filmnagar, Tollywood Cinema News
Anasuya Bharadwaj Kathanam Movie Release Date Locked

ఒకపక్క యాంకర్ గా చేస్తూనే మరోపక్క వరుస సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా కెరీర్ లో దూసుకుపోతుంది అనసూయ. క్ష‌ణం సినిమాతో సీరియ‌స్ న‌టిగా గుర్తింపు తెచ్చుకొని… ఆ త‌ర్వాత రంగస్థలం సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు రంగమ్మత్తగా గుర్తుండిపోయింది. అటు మంచి పాత్రలు ఎంచుకుంటూ మంచి నటిగా గుర్తింపుతెచ్చుకొని ఇప్పుడు ప్రధాన పాత్రలు చేసే స్థాయికి చేరుకుంది. ఇక ఇప్పుడు క‌థ‌నం సినిమాతో మ‌రోసారి త‌న స‌త్తా చూపించ‌డానికి వ‌చ్చేస్తుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అనసూయ ప్రధాన పాత్రలో రాజేష్‌ నాదెండ్ల ద‌ర్శ‌క‌త్వంలో కథనం అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ది మంత్ర ఎంట‌ర్‌టైన్మెంట్స్‌, ది గాయ‌త్రి ఫిల్మ్స్ బ్యానర్లపై బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ‌చుక్కా లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈసినిమా ఫస్ట్ లుక్, టీజర్ ను రిలీజ్ చేయగా వాటికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు చిత్రయూనిట్. ఆగష్ట్ 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.

ఇంకా ఈ చిత్రంలో అవ‌స‌రాల శ్రీ‌నివాస్‌, ర‌ణ‌ధీర్‌, ధ‌న్‌రాజ్‌, వెన్నెల‌కిషోర్‌, పెళ్లి పృధ్వీ, స‌మీర్‌, ముఖ్తార్‌ఖాన్‌, రామ‌రాజు, జ్యోతి త‌దిత‌రులు న‌టిస్తున్నారు. ఈ చిత్రానికి ప్రొడ‌క్ష‌న్ కంట్రోల‌ర్ః బాలాజీ శ్రీ‌ను, ఎడిట‌ర్ఃఎస్‌.బి. ఉద్ద‌వ్‌, మ్యూజిక్ః సునీల్ క‌శ్య‌ప్‌, ఆర్ట్ డైరెక్ట‌ర్ః కె.వి.ర‌మ‌ణ‌, డైరెక్ట‌ర్ ఆఫ్ ఫొటోగ్ర‌ఫీః స‌తీష్ ముత్యాల‌, లైన్ ప్రొడ్యూసర్ : ఎమ్‌.విజ‌య చౌద‌రి, నిర్మాత‌లుః బి.న‌రేంద్ర‌రెడ్డి, శ‌ర్మ చుక్కా, క‌థ‌, స్క్రీన్‌ప్లే,ద‌ర్శ‌క‌త్వంఃరాజేష్ నాదెండ్ల‌.

[subscribe]

[youtube_video videoid=VBWST9qsUCM]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

nineteen − 14 =