సినిమా అంటే నిర్మాణం, పంపిణీ, ప్రదర్శన అనే మూడు విభాగాల సమాహారం. సినీ ప్రముఖులలో చాలామంది ఈ మూడింటిలో ఏదో ఒక రంగంలో రాణిస్తారు తప్ప మూడింటిలోనూ సమ స్థాయి విజయాలను సాధించినవారు చాలా అరుదు. అలా మూడు విభాగాలలో విభ్రాంతికరమైన విజయాలను సొంతం చేసుకుంటూ 20 ఏళ్ల విజయవంతమైన ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు దిల్ రాజు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఎస్ వి సి – అంటే “ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్” స్థాపించి నేటికి 20 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఒక సరికొత్త ప్రణాళికతో ముందుకు సాగాలని నిర్ణయించుకుని ఆ వివరాలను, విశేషాలను మీడియాతో షేర్ చేసుకున్నారు దిల్ రాజు. ఈరోజు హైదరాబాద్ దసపల్లా హోటల్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ఇరవై ఏళ్ల క్రితం1999లో “ఒకే ఒక్కడు ” చిత్రంతో డిస్ట్రిబ్యూషన్ ప్రారంభించాం. అదే సంవత్సరం జూలై 24న వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ సంస్థ స్థాపించి తొలి చిత్రంగా పవన్ కళ్యాణ్ “తొలిప్రేమ” చిత్రాన్ని పంపిణీ “చేసాం.
అదే సంవత్సరం మా సంస్థ ద్వారా పంపిణీ చేసిన” పెళ్లి పందిరి” అద్భుత విజయాన్ని సాధించడంతో మా సంస్థకు బలమైన పునాది ఏర్పడింది. అలా ప్రారంభమైన డిస్ట్రిబ్యూషన్ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను పంపిణీ చేసి కొన్ని సంవత్సరాల తరువాత నిర్మాణ రంగంలోకి ప్రవేశించి ఐదు సంవత్సరాల పాటు అద్భుత విజయాలను అందుకున్నాం. ఆ తరువాత ప్రొడక్షన్ స్పీడ్ అప్ చేసి 16 సంవత్సరాలలో 32 పైగా చిత్రాలు నిర్మించాం. ఈరోజుతో 20 సంవత్సరాల గొప్ప జర్నీ పూర్తిచేసుకున్న సందర్భంగా మా యాక్టివిటీ ని మరింత విస్తృతం చేయడం కోసం ఒక నిర్ణయం తీసుకున్నాం. నిర్మాణపరమైన ప్రాథమిక అవగాహన కలిగిన కొత్త నిర్మాతలు గానీ, అనుభవం ఉన్న నిర్మాతలు గాని మంచి స్క్రిప్టుతో వస్తే
మా ఎస్ వి సి తో కలసి సంయుక్త నిర్మాణానికి అవకాశం కల్పిస్తాం. ఈ రోజున సినిమా నిర్మాణమే కాకుండా
పంపిణీ, ప్రదర్శనలు కూడా కష్టతరమైన సందర్భంలో స్క్రిప్ట్ దశ నుండి రిలీజ్ వరకు నిర్మాతలకు
మా సహాయ సహకారాలు ఉంటాయి.
ఇది వ్యక్తిగతంగా అప్ కమింగ్ నిర్మాతలకు ఉపకరించడమే కాకుండా ఒక నెక్స్ట్ లెవెల్ ఆఫ్ యాక్టివిటీకి హెల్ప్ అవుతుంది. మేము 2017 లో ఆరు సినిమాలు, 2018 లో మూడు సినిమాలు నిర్మించాం. 2019లో నాలుగు సినిమాలు రిలీజ్ అవుతాయి. యాక్టివిటీ ని ఇంకా ఇంకా పెంచటం కోసం మేము తీసుకున్న ఈ నిర్ణయం లో భాగస్వాములు కావడానికి చాలామంది కొత్త నిర్మాతలు, అనుభవజ్ఞులైన నిర్మాతలు ముందుకు రావటం ఆనందంగా ఉంది. సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ గారు, విజయ్, సత్యనారాయణ రెడ్డి, గోపికృష్ణ, రాహుల్, కోనేరు మహేష్ తదితరులతో కలిసి సంయుక్త నిర్మాణం జరుగుతుంది”- అంటూ వారందరిని వేదికపైకి ఆహ్వానించారు దిల్ రాజు.
ఈ కార్యక్రమానికి అతిథులుగా యువ దర్శకులు వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి హాజరయ్యారు. ముందుగా వంశీ పైడిపల్లి మాట్లాడుతూ” దిల్ రాజు , శిరీష్, లక్ష్మణ్ గార్ల 20 సంవత్సరాల ప్రయాణంలో నేను భాగస్వామిని కావటం ఆనందంగా ఉంది.18 ఏళ్ల క్రితం మురారి, ఖుషి సినిమాల టికెట్ల కోసం వాళ్ల ఆఫీస్ కి వెళ్ళే వాడిని. ఇప్పుడు వారి సంస్థలోనే దర్శకుడిగా ఉండటం గర్వకారణం. వాళ్లకు డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ విభాగాలలో కూడా అనుభవం ఉండటం వల్ల సినిమాకు సంబంధించిన ground level రియాలిటీస్ బాగా తెలుసు. దర్శకుడిగా నా తొలి చిత్రం బాగా అడక పోయినప్పటికీ మరో అవకాశాన్ని నాకు ఇచ్చి నన్ను నిలబెట్టిన ఆ ముగ్గురికి నేను రుణపడి ఉంటాను- అన్నారు.
ప్రస్తుతం ఎస్ వి సి లో “సరిలేరు నీకెవ్వరు” చిత్రానికి దర్శకత్వం వహిస్తున్న అనిల్ రావిపూడి మాట్లాడుతూ” దర్శకుడిగా నా నాలుగు సినిమాలు పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్, ఎఫ్ 2, నిర్మాణంలో ఉన్న ” సరిలేరు నీకెవ్వరు” వరకు చూసుకుంటే వాళ్ల 20 ఏళ్ల జర్నీలో నా అయిదేళ్ల జర్నీ కూడా కలిసి పోయింది. దిల్ రాజు గారి జడ్జిమెంట్, శిరీష్ గారి ప్లానింగ్, లక్ష్మణ్ గారి ఎగ్జిక్యూషన్ ఈ మూడు ఈ సంస్థ విజయాలకు నిర్వచనాలుగా చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రొడక్షన్ పెంచటం కోసం వీరు తీసుకున్న నిర్ణయం వల్ల వాళ్లకే కాకుండా ఇండస్ట్రీ కి కూడా గొప్ప మేలు జరుగుతుంది” అన్నారు.
సీనియర్ ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ “ఈ సంయుక్త నిర్మాణం అనేది కొత్త నిర్మాతలకే కాదు 35 ఏళ్ల అనుభవం ఉన్న నాలాంటి సీనియర్ ప్రొడ్యూసర్స్ కు కూడా ఒక మంచి ప్లాట్ ఫారం అవుతుంది. ప్రస్తుత పరిస్థితుల్లో మీ వెనుక మేమున్నామని ధైర్యం చాలా అవసరం. అలాంటి ధైర్యాన్ని కల్పిస్తున్న దిల్ రాజు గారికి అభినందనలు కృతజ్ఞతలు” అన్నారు.
ఈ సందర్భంగా నూతన, ఔత్సాహిక నిర్మాతలు దిల్ రాజుకు కృతజ్ఞతలు తెలియజేశారు.
[youtube_video videoid=3d-H1sYBHkQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: