యువ కథానాయకుడు అఖిల్ అక్కినేని హీరోగా ‘బొమ్మరిల్లు’ భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రంలో… అఖిల్ అప్పర్ మిడిల్ క్లాస్ అబ్బాయి గా కనిపించనున్నట్లు సమాచారం. కాగా… ఇందులో అఖిల్ కి జోడిగా ‘గ్యాంగ్ లీడర్’ చిత్ర కథానాయిక ప్రియాంక అరుళ్ మోహన్ ఎంపికైందని తెలిసింది. త్వరలో ప్రియాంక ఎంట్రీ పై క్లారిటీ రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ను మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తుండగా… ‘బన్నీ’ వాస్, వాసు వర్మ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఈ ఏడాది చివర్లో ప్రేక్షకుల ముందుకు రానున్నట్టు ప్రచారం సాగుతోంది.
[youtube_video videoid=B7cm2UcOYV0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: