కీలక పదవి దక్కించుకున్న అలీ

రాజకీయాలకు, సినీ పరిశ్రమకు అవినాభావసంబంధం ఉంటుందన్న సంగతి మనం ఎప్పటినుండో చూస్తూనే ఉన్నాం. ఎంతో మంది సినీ పరిశ్రమలో చక్రం తిప్పిన ప్రముఖులు.. రాజకీయాల్లో కూడా మార్కు చూపించారు. అలా ఒకవైపు సినిమాలు చేస్తూనే.. మరోవైపు రాజకీయాల్లో కూడా సేవలు అందించడానికి మన తెలుగు పరిశ్రమనుండి ఇప్పటికీ ఎంతో మంది సినీ పరిశ్రమ నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తూనే ఉన్నారు. అందులో టాలీవుడ్ టాప్ కమెడియన్ అలీ కూడా ఉన్న సంగతి తెలిసిందే. పృథ్విరాజ్

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అలీ వైసీపీ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఎన్నికల్లో పలు ప్రచారాల్లో పాల్గొని తన వంతు తన సహకారం అందించారు. అందుకే ఇప్పుడు జగన్ అలీకి మంచి గుర్తింపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ఫిలిం డెవలప్ మెంట్ కార్పోరేషన్ ఛైర్మన్(APFDC Chairman) గా భాధ్యతలు అందించారు. ఇంతకు ముందు ఈ పదవిలో అంబికా కృష్ణ బాధ్యతలు నిర్వహించేవారు. ప్రస్తుతం ఆయన టీడీపీ ని వీడి బీజేపీ లో చేరారు. మరి ముందు నుండి కొంచెం పెద్ద పదవులపైనే ఇంట్రెస్ట్ చూపించిన అలీకి ఈ పదవి నచ్చుతుందో? లేదో? చూద్దాం.

కాగా శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌(ఎస్వీబీసీ) చైర్మన్‌గా సినీనటుడు, వైసీపీ నేత పృథ్వీరాజ్ ను జగన్ నియమించిన సంగతి విదితమే. గత ప్రభుత్వ హయాంలో ప్రముఖ డైరెక్ట‌ర్‌ రాఘవేంద్రరావు ఎస్వీబీసీ ఛైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఏపీలో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌ ఆయన తన పదవికి రాజీనామా చేశారు.

[subscribe]

[youtube_video videoid=oKUwVqkdll4]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

2 × 1 =