పరిశ్రమలో అందరూ పదవీ వ్యామోహాలకు అతీతంగా ఆలోచించాలి

2019 Latest Telugu Movie News, What Consequences Will these Film Chamber Elections Lead to?, Narayan Das Narang elected Telugu film chamber president, Film Chamber Elections May Lead to Consequences, Producer Narayandas elected as president of Telugu Film Chamber, Producer Narayandas As film chamber new president, Telugu film updates, Telugu Filmnagar, Tollywood cinema News
What Consequences Will these Film Chamber Elections Lead to?

మొన్న జరిగిన తెలుగు ఫిలిమ్ ఛాంబర్ ఎన్నికలలో సంఖ్యా బలం దృష్ట్యా ప్రొడ్యూసర్స్ సెక్టార్ నుండి “మన ప్యానెల్” ఘన విజయాన్ని సాధించినప్పటికీ అందులో పేరున్న అగ్ర నిర్మాతలు ఎవరూ లేకపోవడం చర్చనీయాంశం అవుతుంది. “మన ప్యానెల్” అభ్యర్థులలో ఎవరో కొద్దిమంది తప్ప యాక్టివ్ ప్రొడ్యూసర్స్ లేరు. ఏ రోజుకారోజు అన్నట్లుగా మారి పోతున్న చిత్ర నిర్మాణ ధోరణుల పట్ల, సమస్యల పట్ల అవగాహన లేని నిర్మాతలు అధిక సంఖ్యలో ఉండటం, రెగ్యులర్ గా చిత్రాలు నిర్మించే అగ్ర నిర్మాతలు దాదాపుగా లేకపోవటంతో ఈ ఎన్నికల ఫలితాల పట్ల కొందరు ప్రముఖులు, పరిశీలకులు పెదవి విరుస్తున్నారు.రెగ్యులర్ గా చిత్రాలు నిర్మించే అగ్రనిర్మాతలు చాలామంది ఈ ఫలితాల పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

వీరిలో చాలామంది ఫిలిం చాంబర్ తో పాటూ నిర్మాతల మండలికి కూడా రాజీనామా చేసి వేరే అసోసియేషన్స్ స్థాపించుకునే దిశగా ప్రయత్నాలు ప్రారంభించినట్టు తెలిసింది. గతంలో ఉన్న ఎల్. ఎల్. పి. స్థానంలో దాదాపు ఇరవై ఒక్కమంది అగ్ర నిర్మాతలు గిల్డ్ గా ఏర్పడి కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. అయితే చిత్రపరిశ్రమలోని నిర్మాతలందరి సమైఖ్య, సంక్షేమాల కోసం ఏర్పడిన ప్రొడ్యూసర్స్ కౌన్సిల్
నుండి 21 మంది రన్నింగ్ అండ్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ మౌలికంగా బయటికి వచ్చి గిల్డ్ పేరిట వేరు కుంపటి పెట్టుకోవాల్సిన పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? దాదాపు 1200 మందికిపైగా సభ్యులు ఉన్న తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి నుండి ఇరవైఒక్క మంది నిర్మాతలు బయటకు వచ్చి గిల్డ్ పేరిట వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటే ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఉనికికి వచ్చిన ప్రమాదం ఏమిటి?

కౌన్సిల్ లో సభ్యులుగా కొనసాగుతూనే వేరుగా ఒక గిల్డ్ పెట్టుకొనవలసిన అవసరం రన్నింగ్ ప్రొడ్యూసర్స్ కు ఎందుకు ఏర్పడింది? కౌన్సిల్లోని 1200 మందికి పైగా సభ్యుల ప్రయోజనాలు ఏమిటి? గిల్డ్ గా ఏర్పడిన 21 మంది నిర్మాతల ప్రయోజనాలు ఏమిటి? అగ్ర నిర్మాతలందరూ ఒక వైపు- అడపాదడపా నిర్మాతలందరూ మరోవైపు చీలిపోయి కాలుదువ్వుకునే పరిస్థితులు ఎందుకు ఏర్పడ్డాయి? చిత్ర పరిశ్రమలో అనేకానేక అంశాల పట్ల ఏకాభిప్రాయ సాధన ఎందుకు సాధ్యపడటం లేదు? పరిశ్రమలో వ్యక్తుల ప్రయోజనాలకు వ్యవస్థ ప్రయోజనాలకు మధ్య జరుగుతున్న సంఘర్షణ ఏమిటి?

విశ్లేషిద్దాం….!

ప్రతి రంగంలోనూ”మాజీలు- తాజాలు” ఉంటారు. అయితే ఏ రంగంలోనైనా ప్రస్తుతం క్రియాశీలకంగా ఉన్న వ్యక్తుల, సంస్థల అవసరాలు, ప్రయోజనాలే ముఖ్యం- అవే కీలకం. వ్యవస్థలను నడిపించేది అవే. ప్రతి రంగంలోనూ ఉండటానికి పదుల సంఖ్యలో సంస్థలు, వేల సంఖ్యలో వ్యక్తులు ఉన్నప్పటికీ వర్తమానంలో క్రియాశీలకంగా ఉండేవారి ప్రయోజనాలనే పరిగణలోకి తీసుకోవలసి ఉంటుంది. ముఖ్యంగా యాక్టివిటీ, సక్సెస్ లే ప్రామాణికంగా సాగే చిత్ర పరిశ్రమలో ప్రజెంట్ రన్నింగ్ లో ఉన్న నిర్మాతల అవసరాలు, అభిప్రాయాలే పాలసీలుగా అమలవుతాయి. ఇక్కడ సంవత్సరాల తరబడి సినిమాలు తీయని వారి సంఖ్యా బలం కంటే రెగ్యులర్ గా చిత్రాలు నిర్మించే తక్కువమంది
“యాక్టివ్ ప్రొడ్యూసర్స్” సామర్ధ్య బలానికే ప్రాధాన్యత ఇవ్వవలసి ఉంటుంది.

నిజానికి ప్రస్తుతం ప్రొడ్యూసర్ కౌన్సిల్ లో 1200 మందికి పైగా ఉన్న లైఫ్ అండ్ టెంపరరీ మెంబర్స్ లో ఎంతమంది సినిమాలు తీస్తున్నారు?
ఎంతమంది యాక్టివ్ గా ఉన్నారు ? సంవత్సరాల తరబడి సినిమాలు తీయని నిర్మాతలు వందల సంఖ్యలో ఉన్నారన్న వాస్తవాన్ని ఎవరైనా కాదనగలరా? చిత్ర పరిశ్రమ ఉనికికి, గ్లామర్ కు ఆధారం యాక్టీవ్ అండ్ రన్నింగ్ ప్రొడ్యూసర్స్ అయినప్పుడు కేవలం తలల లెక్కల సంఖ్యాబలంతో ప్రొడ్యూసర్ కౌన్సిల్ లోనూ, ఫిలిం ఛాంబర్ లోనూ నిర్ణయాత్మక శక్తులుగా వ్యవహరించాలనుకోవటం సరికాదు.

చిన్న నిర్మాతలైనా పెద్ద నిర్మాతలైనా ఫిల్మ్ ఇండస్ట్రీ అంటే “యాక్టివ్ ప్రొడ్యూసర్స్”. వాళ్ల విజయాలు, వాళ్ల అపజయాలు, వాళ్ల సాధకబాధకాలు, వాళ్ళ లాభనష్టాలే చిత్ర పరిశ్రమను నడిపిస్తాయి తప్ప ఎప్పుడో తాతలు నేతులు తాగిన తాలూకు వాసనల వల్ల పరిశ్రమ మనలేదు… మనుగడ సాగించలేదు.ఎప్పుడైనా చిత్ర పరిశ్రమ బతికేది బట్ట కట్టేది ఇప్పుడు యాక్టివ్ గా ఉన్న నిర్మాతల వల్ల తప్ప ఎప్పుడో సినిమాలు తీసి ప్రస్తుతం చిత్ర సన్యాసం లో ఉన్న పన్నెండు వందల సంఖ్యాబలంతో కాదు.

కాబట్టి పదవీ వ్యామోహాలకు అతీతంగా ఆలోచించి నిర్మాతల మండలి సమగ్ర సంక్షేమానికి అవసరమైన కార్యాచరణ వైపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది.ఫేస్ వాల్యూ, ప్రజెంట్ యాక్టివిటీ, సీనియారిటీ కలిగిన ప్రముఖులైన నిర్మాతలు “నిర్మాతల మండలి”లో కీలక బాధ్యతలు చేపట్టి పరిస్థితులను చక్కదిద్ది వలసిన అవసరం ఉంది.ఎప్పటివో పాత నిర్ణయాలు, పాలసీల కారణంగా నిర్మాతల మండలి, ఫిలిం చాంబర్ లలో అనేక అక్రమాలు, అవకతవకలు చోటుచేసుకుంటున్నాయి.

నిర్మాతల మండలిలో సభ్యుల ఇన్సూరెన్స్ పాలసీని 4 లక్షల నుండి 3 లక్షలకు కుదించవలసిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది? నిర్మాతల మండలి ఆదాయానికి గండి కొట్టిన గత ఎల్. ఎల్. పి. గాని , ప్రస్తుత గిల్డ్ ను గానీ విలీనం చేసుకోవడంలో వ్యవస్థ ప్రయోజనాల కన్నా వ్యక్తుల ప్రయోజనాలే డామినేట్ చేయడం దురదృష్టకరం. ఇక నిర్మాతల మండలిలోనూ, ఫిలిం ఛాంబర్ లోనూ పేరుకుపోయిన అనేకానేక అవకతవకలు, అక్రమాలను కూడా ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్, హౌసింగ్ వంటి సంక్షేమ పథకాల లబ్దికోసం అర్హులు కాని, చిత్ర పరిశ్రమతో ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తులు సభ్యులుగా చొరబడ్డారు.చిత్రపరిశ్రమలోని చాలా అసోసియేషన్స్ లో లాగానే నిర్మాతల మండలిలో కూడా దాదాపు 250 కి పైగా అనర్హమైన దొంగ మెంబర్ షిప్ లుఉన్నాయన్నది వాస్తవం కాదా?

సంవత్సరాల తరబడిగా సినిమాలు తీయకపోయినా కేవలం ఎన్నికల సమయంలో ” ఓటు బ్యాంకు రాజకీయాలకు ఈ దొంగ ఓటుబ్యాంకును వాడుకుంటున్నది నిజం కాదా? ఫిలిం ఛాంబర్ ఎన్నికలలో ‘వ్యక్తి’ కి ఓటు పద్ధతి కాకుండా’ బ్యానర్’ కు ఓటు పద్ధతి వల్ల ఒక్కొక్కరు పదుల సంఖ్యలో ఓట్లు గుద్దేయటం ఏ ప్రజాస్వామ్య విలువలకు ప్రతీక అనుకోవాలి? అయినా వ్యక్తికి ఓటు కాకుండా బ్యానర్ కు ఓటు అనే అరాచక విధానానికి స్వస్తి చెప్పాల్సిన అవసరం లేదా? ఇవే కాదు… ప్రొడ్యూసర్స్ కౌన్సిల్, ఫిలిం ఛాంబర్, ఫిలింనగర్ హౌసింగ్ సొసైటీ, ఫిలిం ఫెడరేషన్, చిత్రపురి హౌసింగ్ కాలనీ- ఇలా చిత్రపరిశ్రమలోని ప్రతి ” ట్రేడ్ బాడీ” అక్రమాలు, అవకతవకల నిలయాలుగా మారిపోయాయి. వీటన్నింటిలో సమూల , సమగ్ర ప్రక్షాళన అవసరం. అది జరగాలి అంటే చిత్ర పరిశ్రమలో కీలకమైన తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి సభ్యులలో పదవీ వ్యామోహం దృష్టి కన్నా పరిశ్రమ సంక్షేమ దృష్టి పెరగాలి.

ఆలా కాకుండా వ్యక్తిగత ప్రయోజనాల ఎజెండాతో ముందుకు వెళ్తే చిత్ర పరిశ్రమలో చీలిక తప్పదేమో!? రాష్ట్రంరెండు ముక్కలుగా చీలినప్పటికీ చిత్ర పరిశ్రమలో ఆ విభజన ప్రభావం ఏమాత్రం లేదు. కానీ ఇప్పుడు వ్యక్తిగత ప్రయోజనాల నేపథ్యంలో పరిశ్రమలో విభేదాలు తారా స్థాయికి చేరుకోకముందే మేలుకోవటం మంచిది.

[subscribe]

[youtube_video videoid=vtic_stLAl8]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.