ఎఫ్2 సినిమాతో ఈ ఏడాది ప్రారంభంలోనే మంచి హిట్ ను కొట్టింది మెహ్రీన్. ఇక ఈ సినిమాతో అమ్మడికి తమిళ్ నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి. దీనిలో భాగంగానే తమిళ్ స్టార్ హీరో ధనుష్ తో నటించే అవకాశం దక్కింది. పటాస్ అనే టైటిల్ తో తెరకెక్కుతున్న ఈసినిమాలో ధనుష్, మెహ్రీన్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇక ఈరోజు ధనుష్ పుట్టినరోజు కావడంతో ధనుష్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉండగా.. ఈసినిమాలో సీనియర్ హీరోయిన్ స్నేహ కూడా నటిస్తున్నట్టు తెలుస్తోంది. నిజానికి ఈసినిమా ధనుష్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నాడట. ఈ నేపథ్యంలో తండ్రి పాత్రకు హీరోయిన్ గా స్నేహ నటిస్తుంది. కొడుకు పాత్రకు హీరోయిన్ గా మెహ్రీన్ నటిస్తుంది. దీంతో ఈసినిమాలో ఇద్దరూ అత్తాకోడళ్లుగా నటిస్తున్నారన్నమాట. కాగా సత్యజ్యోతి ఫిలిమ్స్ బ్యానర్ పై ఆర్ ఎస్ సెంథిల్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సంగీతం వివేక్ మరియు మెర్విన్ ద్వయం సంగీతం అందిస్తున్నారు.
మరి తెలుగులో కూడా పలు సినిమాలతో బిజీగా ఉంది ఈ భామ. మరి తమన్నా చెల్లిగా “ఎఫ్2” చిత్రంలో నటించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెహ్రిన్, ఇప్పుడు స్నేహ కోడలిగా.. తమిళంలో కూాడా మరో హిట్ అందుకుంటుందేమో చూడాలి.
[youtube_video videoid=IRmyPmrcPXA]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























