సినీ ఇండస్ట్రీలో వారసత్వం అనేది కామన్ థింగ్. ఒక ఫ్యామిలీలో ఒకళ్లు ఎంట్రీ అయితే చాలు.. తరువాత వారి బాటలోనే ఆ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంట్రీ ఇస్తారు. అయితే ఎంట్రీ అయితే ఈజీగా దొరుకుతుంది కానీ… కెరీర్ మాత్రం తమ టాలెంట్ పై ఆధారపడి ఉంటదనుకోండి. అది వేరే విషయం. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే..ఫిదా సినిమాతో అందరినీ ఫిదా చేసిన సాయి పల్లవి సిస్టర్ పూజ కన్నన్ ఎంట్రీ గురించి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
గత కొద్ది రోజులుగా సాయి పల్లవి సిస్టర్ పూజా కన్నన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. దానికి తోడు ఇటీవల హీరో ధనుష్ తో దిగిన ఓ ఫొటో ను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో ఇక నిజమే అన్న అభిప్రాయానికి వచ్చారు అందరూ.
ఇక ఈ రూమర్లపై స్పందించిన సాయి పల్లవి.. తాను ప్రస్తుతం ఎంబీబీఎస్ చేస్తోందని, తన దృష్టంతా చదువుపైనే ఉందని, సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తల్లో నిజం లేదని క్లారిటీ ఇచ్చింది. కాగా సాయి పల్లవి ప్రస్తుతం రానాకు జోడిగా ఓ సినిమాలో నటిస్తుంది.
[youtube_video videoid=CQ_7dQbA-HY]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: