స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, ఏస్ ఫిల్మ్ మేకర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్‌లో `జులాయి`, `సన్నాఫ్ సత్యమూర్తి` వంటి విజయవంతమైన చిత్రాల తరువాత మరో సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారికా అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే పట్టాలెక్కనుంది. ఇదిలా ఉంటే… ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు స్థానముండగా… వారిలో ఒకరిగా ఇప్పటికే పూజా హెగ్డే ఎంపికయ్యిందని వార్తలు వినిపిస్తున్నాయి. అలాగే మరో హీరోయిన్ గా కేథరిన్ ట్రెసా పేరు పరిశీలనలో ఉందని సమాచారం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
బన్నీ, కేథరిన్ కాంబినేషన్‌లో ఇప్పటికే మూడు చిత్రాలు వచ్చాయి. `ఇద్దరమ్మాయిలతో`, `రుద్రమదేవి`, `సరైనోడు` చిత్రాల్లో ఈ జోడీ అలరించింది. మూడేళ్ళ తరువాత మళ్ళీ ఈ ఇద్దరూ జట్టుకట్టడం విశేషం. త్వరలోనే కేథరిన్ ఎంట్రీపై క్లారిటీ వస్తుంది. యువ సంగీత సంచలనం తమన్ స్వరాలు అందించనున్న ఈ సినిమాకి సంబంధించిన పూర్తి వివరాలను మహాశివరాత్రి సందర్భంగా చిత్ర యూనిట్ ప్రకటించనుందని సమాచారం.
[youtube_video videoid=tYm_pbS65_Q]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: