తెలుగునాట అగ్ర కథానాయికగా రాణిస్తున్న అందాల తార రకుల్ ప్రీత్ సింగ్. దాదాపు ఈ తరం అగ్ర కథానాయకులందరితోనూ రకుల్ ఆడిపాడింది. కేవలం తెలుగు చిత్రాలకే పరిమితం కాకుండా… తమిళ, హిందీ చిత్రాలతోనూ ఈ ఉత్తరాది సోయగం ఫుల్ బిజీగా ఉంది. ప్రస్తుతం రకుల్ నటిస్తున్న తమిళ చిత్రాలలో `ఎన్జీకే` ఒకటి. కోలీవుడ్ స్టార్ సూర్య హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి శ్రీ రాఘవ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ మూవీ… వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాకి వర్క్ చేయడం రకుల్ కి చాలా స్పెషల్ అనే చెప్పాలి. ఎందుకంటే… రకుల్ కథానాయికగా నటించిన తొలి చిత్రం `గిల్లి` (కన్నడ సినిమా)…. తెలుగులో ఘనవిజయం సాధించిన `7జి బృందావన కాలనీ`కి రీమేక్‌గా తెరకెక్కింది. కట్ చేస్తే… సరిగ్గా పదేళ్ళ తరువాత ఆ సినిమాకి దర్శకత్వం వహించిన శ్రీ రాఘవ దర్శకత్వంలోనే నేరుగా పనిచేసే అవకాశాన్ని దక్కించుకుంది ఈ స్టన్నింగ్ బ్యూటీ. మరి… ఈ స్పెషల్ మూవీతో రకుల్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి.
[youtube_video videoid=ZhaXKnrK2WQ]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: