హిందీనాట స్టార్ డమ్ పొందిన యంగ్ హీరోయిన్ శ్రద్ధా కపూర్… తెలుగునాట `సాహో` చిత్రంతో పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. `బాహుబలి` సిరీస్ తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమా కావడంతో… ఈ క్రేజీ ప్రాజెక్ట్‌పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఆ క్రేజ్‌కు తగ్గట్టే… తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోనూ ఈ సినిమా రిలీజ్ కానుంది. `రన్ రాజా రన్` ఫేం సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని… సక్సెస్‌ఫుల్ ప్రొడక్షన్ హౌస్ యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోంది. ఆగస్టు 15న ఈ సినిమాని ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలా ఉంటే… ఈ సినిమాలో నాయిక శ్రద్ధా కపూర్ పాత్రకి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం తెలిసింది. అదేమిటంటే… ఇందులో ఈ బాలీవుడ్ బ్యూటీ ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ గా దర్శనమివ్వనుందని సమాచారం. ఎంతో పవర్‌ఫుల్ గా ఉండే ఈ పాత్ర… సినిమా హైలైట్స్‌లో ఒకటని టాక్. అందుకే ఆ పాత్ర తాలూకు లక్షణాలను తెలియజేస్తూ… శ్రద్ధ పుట్టినరోజుని పురస్కరించుకుని మార్చి 3న `షేడ్స్ ఆఫ్ సాహో ఛాప్టర్ 2`ని రిలీజ్ చేయనుందట యూనిట్. మరి… తొలి తెలుగు చిత్రంతో శ్రద్ధ ఏ మాత్రం స్కోర్ చేస్తుందో చూడాలి.
[youtube_video videoid=KnxkRr1A6e0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: