పాఠశాల సినిమాతో దర్శకుడిగా మారిన మహి.వి రాఘవ్ తాజాగా యాత్ర సినిమాతో మరోసారి మంచి మార్కులు కొట్టేశాడు. వైఎస్ పాదయాత్ర నేపథ్యంలో తెరకెక్కిన ఈసినిమాకు మంచి టాక్ రావడమే కాదు విమర్శకుల ప్రశంసలు సైతం దక్కాయి. ఇక ఇప్పుడు తాజాగా మహి ఓ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందేంటంటే.. మహి వి రాఘవ మరియు అతని సన్నిహితులైన శివమేక, రాకేష్ మంహకాళి సంయుక్తంగా త్రీ ఆటమన్ లీవ్స్ పేరిట ఓ ప్రొడక్షన్ హౌస్ ని స్థాపించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అయితే ఇక్కడే ఓచిన్న తేడా ఉంది. నార్మల్ గా ప్రొడక్షన్ హౌస్ ల ద్వారా సినిమాలను నిర్మించి విడుదల చేస్తారు. కానీ ఈ ప్రొడక్షన్ హౌస్ ద్వారా టాలెంట్ ఉన్న యంగ్ రైటర్స్ తో సినిమాలు రాయిస్తూ… వారిని ప్రోత్సహిస్తూ.. వారి చేత కొత్త కొత్త కథల్ని రాయించి.. ఆతరువాత మంచి స్క్రిప్ట్స్ తో సినిమాలు నిర్మించనున్నారట. కేవలం వారు మాత్రమే కాదు.. పలు నిర్మాణ సంస్థలతో కలిసి నిర్మించేందుకు కూడా త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ ముందుంటుదని మహి వి రాఘవ తెలిపారు. కేవలం సినిమాలనే కాకుండా వెబ్ సిరీస్ లు, డాక్యుమెంటరీలకి సంబంధించిన రచయితలు, ఫిల్మ్ మేకర్స్, నిర్మాణ సంస్థలు, ఛానల్ పార్టనర్స్ తో జతకలిసేందుకు త్రీ ఆటమన్ లీవ్స్ సంస్థ సముఖంగా ఉందని మహి వి రాఘవ తెలిపారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఇటీవలే విడుదలై సంచలన విజయాన్ని అందుకున్న యాత్ర సినిమాకి కో ప్రొడ్యూసర్ గా త్రీ ఆటమన్ లీవ్స్ వ్యవహరించిందని, ఆ చిత్రంలో కథకు పట్టం కట్టిన తెలుగు ప్రేక్షకుల అంతః అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకునే త్రీ ఆటమన్ లీవ్స్ ద్వారా కథల్ని ముందుగా కాగితాల పై నిర్మించి ఆ తరువాత పలు నిర్మాణ సంస్థలతో కలిసి తెర పై నిర్మించే నిర్ణయానికి వచ్చినట్లుగా దర్శకుడు మహి, నిర్మాతలు శివ మేక, రాకేష్ మహంకాళి తెలిపారు. మరి మహి. వి. రాఘవ తీసుకున్న నిర్ణయం హర్షించతగినదే అని చెప్పొచ్చు. ఈ నిర్ణయం ద్వారా ఎంతో మంది టాలెంటెడ్ రైటర్స్ బయటకు వచ్చి.. వారిలో ఉన్న టాలెంట్ ను చూపించుకునే అవకాశం కలిగిస్తున్నారు.
[youtube_video videoid=WxixwW2DQ6Y]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: