`శ్రీమంతుడు`, `జనతా గ్యారేజ్`, `రంగస్థలం` చిత్రాలతో హ్యాట్రిక్ విజయాలను అందుకున్న నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్. ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్‌లను నిర్మిస్తూ ఈ ప్రొడక్షన్ హౌస్… టాక్ ఆఫ్ టాలీవుడ్ అవుతోంది. ఇదిలా ఉంటే… మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌ని కూడా ఈ నిర్మాణ సంస్థ టేకప్ చేయనుందని టాలీవుడ్ టాక్.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఆ వివరాల్లోకి వెళితే… మెగాపవర్ స్టార్ రామ్ చరణ్‌తో `రంగస్థలం` చిత్రాన్ని నిర్మించి ఘనవిజయం అందుకున్న మైత్రీ మూవీ మేకర్స్… ప్రస్తుతం సాయిధరమ్ తేజ్‌తో `చిత్రలహరి`, అతని తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో మరో సినిమాని ప్రొడ్యూస్ చేస్తోంది. అంతేకాదు… మరో మెగా హీరో వరుణ్ తేజ్‌తోనూ ఓ మూవీ ప్లానింగ్ జరుగుతోందని సమాచారం. ఓ నూతన దర్శకుడు ఈ చిత్రం ద్వారా పరిచయం కానున్నాడని తెలిసింది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి కానున్నాయి.
[youtube_video videoid=wuxPA9AT7c0]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: